దేశంలో ఇప్పటి వరకు ఎన్నో వివాదాలపై రాజకీయ రగడ జరిగిన విషయం తెలుసు కానీ రీసెంట్ గా ‘భారత్ మాతాకి జై’ అనే అంశంపై పెద్ద దుమారమే చెలరేగుతుంది. తెలంగాణకు చెందిన ఒవైసీ సోదరుల్లో ఇకరు అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. అసదుద్దీన్‌ ఒవైసీ ఓ మీటింగ్ లో పాల్గొంటూ..తాను భారత్ మాతాకీ జై అని తన గొంతు మీద కత్తి పెట్టి అనమన్నా అననూ అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈ దుమారం మొదలైంది.

భారతీయుడై ఉండి భారతమాతను అవమానించే విధంగా మాట్లాడారని జాతీయ ద్రోహం చేశాడని కేసు కూడా నమోదైంది. ఈ విషయంపై రాజ్యసభలో కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిక్‌లో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ‘భారత్‌ మాతాకీ జై’ నినాదంతో ఏకీభవించారు.

అసదుద్దీన్‌ ఒవైసీ


‘భారత్‌ మాతాకీ జై’ అనని వాళ్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదని వ్యాఖ్యానించారు. మరో వైపు భారత్ మాతాకీ జై అనాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ మండిపడ్డారు. భారత్ మాతాకీ జై నినాదం చేయనన్న ఓవైసీ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: