సీఆర్ డీ ఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. కొత్త రాజధాని నిర్మాణం, ప్రపంచ స్థాయిలో నిర్మించాలని భావించడంతో ఈ సంస్థకు ప్రాధాన్యత పెరిగింది. ఈ సంస్థ తీసుకునే నిర్ణయాలు రాజధాని ప్రాంతంలోని పల్లెలపై చూపుతాయి. 

ఐతే.. ఈ సంస్థ రాజధాని ప్రాంత రైతుల లాభం కోసం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు లాభం కోసం పనిచేస్తోందట. అందుకే దాన్ని క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ కాకుండా.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీగా మారిపోయిందట. ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ ప్రజాప్రతనిధి అభిప్రాయం ఇంది. 

చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీడ్ క్యాపిట‌ల్ ప‌రిధిని 20 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు పెంచ‌ుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. దీని వల్ల 20 గ్రామాలు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని రామ‌కృష్ణారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ రాజ‌ధానికి వ్య‌తిరేకం కాద‌ని, రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు రైతుల్నీ, పేద‌లను ఏ ర‌కంగా మోసం చేస్తున్నారో దానికే వ్య‌తిరేక‌మ‌న్నారు. 

సీఆర్డీఏను బాబు వాడేసుకుంటున్నారా..?



చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి భూములు, పొలాలు ఇచ్చిన వారు సైతం బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గ్ర‌హించి కోర్టుల‌కు వెళ్లి మ‌రి వారికి అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నార‌ని రామకృష్ణారెడ్డి వివరించారు. బాబు మాయ‌మాట‌లు న‌మ్మి పొలాలు, భూములిచ్చిన వారికి  పూర్తి లోత‌ట్టు ప్రాంతంలోనే ఇచ్చేందుకు సీఆర్‌డీఏ గ‌తంలోనే స‌న్న‌ాహాలు చేసింద‌ని ఆయన చెప్పారు. 

ఒక‌వైపు లోత‌ట్టు ప్రాంతామ‌ని తెలిసి కూడా ప్ర‌భుత్వ ప‌రంగా నిర్మాణాలు చేప‌డుతుంద‌ని ఆళ్ల విమర్శించారు. మాములు ప్రాంతంలోనే నాలుగైదు, మీట‌ర్లు ఎత్తు లేపాల‌ని సీఆర్‌డీఏ నిర్ణ‌యం తీసుకుంటే, అదే ముంపు ప్రాంతంలో కేటాయించిన భ‌వ‌నాల‌కు క‌నీసం 15 మీట‌ర్ల ఎత్తు పెంచుకుంటే త‌ప్ప వారు నిర్మించుకునే భ‌వ‌నాలు ఒక స్థాయికి రావ‌ని ఆర్కే వివ‌రించారు. ఆ ప్రాంతం మొత్తం ఒక లెవ‌ల్‌కు రావాలంటే తిరుమ‌ల తిరుప‌తి కొండ‌ను మొత్తం త‌వ్వితే త‌ప్ప ఆ లోతు పూర్తి కాద‌ని వ్యంగ్యంగా అన్నారు ఆళ్ల. 

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు బూడిదే మిగిలిందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్సించారు. అధికార పార్టీ నేతలను రైతులు వెంటపడి తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. భూములిచ్చిన రైతులకు ముంపు ప్రాంతాల్లో  స్థలాలు కేటాయించడం దారుణమని ఆళ్ల అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: