రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు చోటు చేసుకోవడం సహజం. అయితే ఇలాంటి సంఘటనలు ప్రజలు వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకుల జరుగుతుంటాయి..కానీ తన నియోజక వర్గంల ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వారికి సహాయం అందించాలని పోయిన ఓ ఎంపీకి అనుకోని ప్రమాదం జరిగి పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది. వివరాల్లోకి వెళితే..గుజరాత్ లో జామ్ నగర్ బిజెపి ఎంపీ పూనమ్ బెన్ మాదమ్ తన నియోజకవర్గంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుండగా పరిశీలించడానికి ఆమె వెళ్ళారు.

ఈ క్రమంలోనే ఓ మురికివాడను సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ డ్రైనేజ్ పై వేసిన స్లాబ్ పై నిలబడి అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారే ఆ స్లాబ్ కూలిపోయింది. దీంతో ఎంపీ పూనమ్ బెన్ మాదమ్ సుమారు పది అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి..స్థానికులు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీశారు.

పోలీసులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన మరో ఇద్దరు మహిళలు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే తమ ప్రాంతాల్లో కూల్చి వేతలు ఆపాలని ప్రజల విజ్ఞప్తి చేయడంతో  పూనమ్ బెన్ మాదమ్ అక్కడికి వెళ్ళారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: