చంద్రబాబు మరికొన్నిగంటల్లో ప్రధాని మోడీని కలుసుకుంటున్నారు. ఏపీ కష్టాలపై ఏకరువు పెట్టబోతున్నారు. అసలే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రులు తేల్చి చెప్పిన నేపథ్ంలో చంద్రబాబు-మోడీ భేటీ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అటు చూస్తే జగన్ జలదీక్ష అంటూ చంద్రబాబును ఇరుకున పడేస్తున్నారు. మరి ఈ సమయంలో చంద్రబాబు మోడీకి ఏం చెబుతారు..? 

ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీతో మాట్లాడేందుకు విభజన హామీలతో పాటు 12 ఇంపార్టెంట్ పాయింట్లను ఐడెంటిఫై చేశారు. ప్రత్యేక హోదాతో పాటు 2014-15 ఆర్థిక సంవత్సర వనరుల లోటు భర్తీ చేయాలని అడగనున్నారు. ఇంకా నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం తగు రీతిలో ఆర్థిక సాయం చేయాలని అడగబోతున్నారు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులూ అడుగుతారు. 

మోడీతో బాబు.. బతిమాలుతారా.. బెదిరిస్తారా.. 


అంతేనా.. ఈ జాబితా ఇంకా ఉంది. వెనుకబడిన 7 జిల్లాలకు నిధులను సత్వరమే విడుదల చేయాలని చంద్రబాబు మోడీకి విజ్ఞప్తి చేస్తారట. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చే వరకూ ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని అడగుతారట. నవ్యాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తారట. ఊరికే అడగడటమే కాదు.. ఏపీలో తానేం చేస్తున్నాడో కూడా చెబుతారట చంద్రబాబు. 

ఈ చెప్పడం, అడగటం అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లేనట. ఇంతవరకూ బాగానే ఉంది.. కానీ ప్రభుత్వాల పరంగా కాకుండా రాజకీయాల విషయం ఈ నేతలిద్దరూ మాట్లాడుకోరా.. ఏంటి మా నిధులతో నువ్వు క్రెడిట్ కొట్టేస్తున్నావట అని మోడీ బాబును అడుగుతారా.. మా టీడీపీని మరీ హీనంగా చూడొద్దు.. ఘోరంగా దెబ్బతింటారని బాబు మోడీకి చెబుతారా.. అన్న ఊహాగానాలు ఉన్నా.. ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే కాబట్టి ఏమైనా జరగొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: