సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సెంటిమెంట్లకు కొన్నింటికి లాజిక్ ఉంటే.. మరికొన్నింటికీ ఏ ఆధారమూ ఉండదు. అలాంటిదే చంద్రబాబు ఓ దుష్ప్రచారం ఉంది. అందేంటంటే.. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు కరవవు.. ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తుతాయి.. ఆయన పరిపాలనలో కరువు విలయ తాండవం చేస్తుంది.. అని. 

గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో విపరీతమైన కరువు వచ్చింది. ముఖ్యంగా 1999 నుంచి 2003 వరకూ ఉమ్మడి ఏపీలో వర్షాలు లేక జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రారంభం కాగానే.. అదేంటో గానీ.. వర్షాలు ఠంచన్ గా కురవడం మొదలయ్యాయి. మళ్లీ కరవు అన్న పదం వినిపించలేదు. 

బాబొచ్చాడు.. కరువొచ్చింది.. అంటున్న నాయకులు..



చంద్రబాబు 2014లో తిరిగి అధికారంలోకి రాగానే కొందరు మళ్లీ కరువు వస్తుందని భయపెట్టారు. కానీ ఆ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. దాంతో బాబుపై దుష్ప్రచారం గాలికి కొట్టుకుపోయింది. కానీ ఈ ఏడాది మళ్లీ కరువు కోరలు చాచడంతో పాత వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై కరవు కామెంట్లు వినిపిస్తున్నాయి.  తాజాగా చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయనతో పాటు కరువు కూడా వచ్చిందని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కామెంట్ చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలూ ఇప్పుడు బాబొచ్చింది కరవువొచ్చిందని అని ప్రచారం మొదలుపెట్టారు. ఐతే.. నాయకులను ఇలా సెంటిమెంట్ పేరుతో విమర్సించడం అంత సభ్యత అనిపించుకోదు. ఓ వ్యక్తి పరిపాలనకు రాగానే ప్రకృతి పగబట్టడం ఉండదు. రాజకీయ విమర్శల్లో హేతు బద్దత లేకుండా పామరుల్లా నోటికొచ్చింది వాగడం సభ్యత అనిపించుకోదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: