విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో నేడు విడుదల కాబోతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంసెట్‌ మెడికల్‌ ఫలితాలు వెల్లడించే అవకాశముందని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ , వైస్ చైర్మన్  వేణుగోపాలరెడ్డి, నరసింహారావు, సెట్ల అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి రఘునాథ్, ఆ శాఖాధికారులతో నిన్న సమావేశమై చర్చించారు.

వచ్చే ఏడాదిలో నీట్‌కు వీలుగా రాష్ట్ర విద్యార్థులను సన్నద్ధం చేస్తామని, నిపుణులతో చర్చించి రాష్ట్ర సిలబస్‌లో సీబీఎస్‌ఈ తరహాలో మార్పులు, చేర్పులు చేయనున్నామని వివరించారు.

ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగం ఈ రోజు 11 గంటలకు విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ మెడికల్ ఫలితాలను అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారమివ్వనున్నట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: