గత కొంత కాలంగా ప్రపంచాన్ని ఉగ్రవాద సంస్థలు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ ఎక్కడ ఎప్పుడు ఎలాంటి బాంబుదాడులు జరుగుతాయో తెలియన అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా మన మద్యే తిరుగుతూ..మానవబాంబులు ఎప్పుడు పేల్చుకుంటారో తెలియదు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయ ప్రాణాలు బలికొంటున్నారు. అయితే ఈ ఉగ్రవాద సంస్థలపై గత కొంత కాలంగా అగ్ర దేశాలైన రష్యా, అమెరికా పోరు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అఫ్ఘనిస్థాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ తమ దేశం జరిపిన వైమానిక దాడుల్లో మృతిచెంది ఉంటాడని అమెరికా అధికారులు వెల్లడించారు.

అఫ్ఘనిస్థాన్ సరిహద్దు వద్ద అహ్మద్ వాల్ ప్రాంతంలో   డ్రోన్ ల సహాయంతో దాడులు చేశామని అమెరికా సైనిక దళాలు తెలిపాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ధృవీకరించారు. అంతే కాదు ఈ విషయంపై పాకిస్థాన్, అఫ్ఘన్ ప్రభుత్వాలకు సమాచారం కూడాఅందించినట్టు వైట్ హౌజ్ పేర్కొంది. మన్సూర్ లక్ష్యంగా దాడి చేసినట్టు పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. కాగా, ముల్లా మహమ్మద్ ఒమర్ మృతి తర్వాత జూలై 2015లో మన్సూర్ బాధ్యతలు స్వీకరించారు.

ఇక తాలిబన్ అగ్రనేత అంతం కావడంతో ఉగ్రవాదులకు కోలులోలేని దెబ్బపడింది. అఫ్గాన్ లో శాంతి ప్రక్రియలకు ఇంత కాలం అడ్డుపడుతూ పెను ముప్పుగా పరిణమించిన తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మన్సూర్ మరణంతో అఫ్గాన్ లో ఇక మీద శాంతి నెలకొంటుందని అమెరికా భావిస్తుంది. మరోవైపు తమ నేత ముల్లా ఒమర్ అమెరికా వైమానిక దాడుల్లో మృతిచెందినట్టు వచ్చిన వార్తలను తాలిబన్ తోసిపుచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: