భారతీయ జనతా పార్టీ పాలనా రథాన్ని రధిగా నరెంద్రమోడీ సారధిగా అమిత్-షా  2014 నుండి విజయపథం లో నడిపిస్తున్నారు.  29 రాష్ట్రాల భారత దేశాన్ని తమ చాతుర్యం తో క్రమ క్రమం గా తమ పరిది లోనికి తెచ్చు కోనే వారి వ్యూహాలు విజయవంత మవుతున్నాయి. పదుల సంఖ్య లో తమ మిత్ర పక్షాలను కూడా కలుపు కొని స్కాముల భాగోతం కొనసాగిస్తూ, అనేక జాతుల, బాషల, సంస్కృతుల సంతులితమైన ఈ దేశాన్ని ఐఖ్యం చేసి స్వాతంత్రసమరం  తరవాత బాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం సర్దార్ వల్లబాయి పటేల్ సారధ్యంలో విజయవంతం గా పూర్తిచేశారు.

 

అతి పురాతన భారత జాతీయ కాంగ్రెస్, నేడు అనేక చీలికలు పేలికలై తుదకు అవశేష కాంగ్రెస్ ముక్కుతూ మూలుగుతూ కొడిగట్టిన దీపంలా చస్తూ బ్రతుకుతూ ఉంది. మహాత్మా గాంధి, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ వంటి మహోన్నత వ్యక్తుల నేతృత్వంలో వెలుగొందిన ఆ పార్టీ నేడు క్రమంగా ఇందిరా గాందీ, రాజీవ్ గాంది, సోనియా గాంది, రాహుల్ గాందీ లాంటి కుక్కమూతి పిందెల నియంత్రణ లోకి మారింది. నెహ్రు కుటుంబం ఇందిర కాలం నుండే రాజకీయంగా పతనమవటం ప్రారంభమైంది. రాహుల్ గాంది కాలానికి కుక్కమూతి పిందెల సంతానం గా మారిపోయింది. 

 

వీళ్ళకి దేశభక్తి ఏలాగూ లేదు. ఒక విదేశీ వనితైన సోనియాని, ఆమె పుత్ర రత్నం పౌరసత్వంపై అనేక సందేహాలున్నా రాహుల్ గాందీ నాయకత్వాన్ని కాంగ్రెస్ భరించినా, జాతి నెత్తిన వీళ్ళ నాయకత్వాన్ని రుద్దుతూ భరించటం తప్పనిసరి తంతుగా  మారింది. జాతిని, మతం, కులం, ప్రాంత వివక్షతలతో చీలిక, పీలికలు చేస్తూ మిత్రభేదం నడిపిస్తూ రాజకీయాలు చేయటం వీరి లక్షణంగా మారింది. తత్ఫలితంగా ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరిగి సామంత రాష్ట్రాల (రాజ్యాల) మయమై ఫెడరల్ స్వరూపం పలుచబడి పోయింది.


మధ్య మధ్య జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను తమ కుతంత్ర రాజకీయాలతో పడగొట్టి తాము సిగ్గులేకుడా మూల సిద్దాంతాలను కూడా వదలివేసి వామపక్షాలతో కూడా ప్రభుత్వాలను నిర్మించిన కాంగ్రెస్ కు నీతీ, నిజాయతీ కలికానికి కూడా లేదని ఋజువు చేసుకుంటూ అధికారమే పరమావధి గా రాజకీయాలను దేశ వ్యాప్తంగా నడుపుతూ జన బాహుళ్యములో ప్రతిష్ఠ కోల్పోయింది.

 

ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలతో మరీ కుదేలైపోవటమే కాక, కేరళ లో వామపక్షాలకు శత్రుపక్షమై, బెంగాల్లో వారికే మిత్రపక్షమై విలువల వలువలు ఊడదీసి, హీనాతి హీనం హేయాతి హేయస్థానానికి పడిపోయింది కాంగ్రెస్. ప్రపంచ రాజకీయాల్లో ఇంత దిగజారుడు ఏ జాతీయ పార్టీ చవిచూడలేదు. కాంగ్రెస్ అవకాశవాదం ప్రజలకు విరక్తి కలిగించింది.



 

ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణాలు:

నాయకత్వ సమస్య, ప్రజాకర్షణ ఏమాత్రం లేని ప్రస్తుత నాయకత్వం: అపరిణిత రాహుల్ గాంధి నాయకత్వం, సమస్యలపై అవగాహన లేకపోవటం, రాహుల్ ను మార్చి వేరే నాయకులకు పట్టాభిషెకం చేసే అవకాశం కాంగ్రెస్ కుటుంబ వారసత్వ కభందహస్తాల నుండి బయట పడేసే  ఆలోచన పార్తి నాయకత్వానికి లేకపోవటం "కాంగ్రెస్ సౌధం కూలిపోయినా ఫర్వాలేదు నాయకత్వాన్ని మార్చే ప్రశక్తి లేదూ, మారిస్తే గీరిస్తే ప్రియాంక వాధ్రాకే పట్టం కట్టటం, ఆపని చేస్తే దేశం పై రాజకీయ అధికారం పరోక్షంగా రాబర్ట్ వాధ్రా కు వస్తే జామాతా దశమగ్రహ అయితే మొదటికే మోసమన్న భయం తో సోనియా మనసులో కొట్టుమిట్టాడు తుండొచ్చు". మొత్తం మీద జాతికి సరైన నాయకత్వం అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉండొచ్చు.

 

నిర్ణయాలు తీసుకోవటములో జాప్యం, అసమర్ధత: అధికారములో ఉన్న ప్రభుత్వ ఎలక్షన్ వాగ్ధానాలు అమలు చేసే వాటిపై శ్రద్ధ పెట్టి నిగ్గదీసే ధోరణి కరవైంది. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టే పనిలో రాహుల్ సేన ముందుంటుంది.

 

అధినాయకత్వం ఒకే ఒక నెహ్రు-గాంధి కుటుంబమే అన్న భావన: ఏడు దశాబ్ధాలుగా ఒకే కుటుంబ పాలనను భరించే దిక్కుమాలిన బానిసత్వం, కాంగ్రెస్ శ్రేణులకు ఉండటం ఈ భరత జాతి ఖర్మ. మధ్యలో ఒక్కసారి అరసారి వేరే కాంగ్రెస్ నేతల నాయకత్వములో దేశం స్వర్ణయుగాన్ని చూసింది. కాని కాంగ్రెస్సొళ్ళకు మాత్రం కట్టుబానిసత్వమే ఇష్టం.

 

రాజకీయ అవకాశవాదం - దేశ ఐఖ్యతకు ప్రమాదమన్న భయం లేకపోవటం: దేశంలో అధికార పార్టీని ఇరుకున పెట్టే ఏ దేశ విద్రొహ శక్తులకైనా రాహుల్సేన నుండి సహకారం దొరుకుతుంది. వాళ్ళు ఐ ఎస్ ఐ ఎస్ తీవ్రవాదులైనా, జె.ఎన్.యు విద్యార్ధులైనా వారికి సమస్యకాదు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఏ పాపమైనా వారికి కనిపించదు. వెస్ట్-బెంగాల్ లో ఏ చిన్న కంత కనిపించినా అందులో దూరి గెలకటములో రాహుల్ బాబు ముందుంటాడు, వామ పక్షాలతో కలసి ఏ అసాంఘిక కార్య  క్రమానికైనా నాయకత్వం వహించటానికి సిగ్గుపడడు.

 

అవినీతి, బందుప్రీతి, మోసపూరిత స్వభావంతో ప్రభలిన ప్రజల అపనమ్మకం: కాంగ్రెస్ పైశాచిక గణాలు, వాళ్ళు అధికారములో ఉన్న ప్రతిరాష్ట్రంలో సాగించిన ప్రకృతి సంపద దోపిడీ పై రాయటానికి పేజీలు చాలవు. పంజాబ్, ధిల్లి, హర్యానా, పంజాబ్, యుపి ప్రాంతాల్లో రాబర్ట్ వాధ్రా భూదోపిడీ నిరంతరాయంగా జరిగిపోయింది.

 

అసహనం పేరుతో దేశములో జరిపిన దమన కాండ:  జవహర్లాల్ మేనకోడలు నయనతారా సెహ్గల్ మొదలుకొని రాహుల్ వరకు దిగ్విజయ్ సింగ్ నుండి అమీర్ ఖాన్ వరకు పాల్గొన్న "అసహనం" పై మొన్న ఐదు రాష్ట్రాల్లో ప్రజల తీర్పు కాంగ్రెస్ పై జనాగ్రహమే కాదు, జన అసహనం కూడా బయటపడ్డ ఇంకా కాగ్రెస్ కు సిగ్గురాలేదంటున్నరు ప్రజలు. 

 

తీవ్రవాదులను సైతం బిజేపి పై పైచేయి సాధించటానికి సమర్ధించటం:  వీళ్ళ దేశభక్తికి పరాకాష్ఠ, సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో - రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరణ తొ ఉరితీయబడ్డ  అఫ్జల్గురు లాంటి తీవ్రాతి తీవ్ర ఉగ్రవాదులకు కూడా అమరవీరుల లా జయంతి, వర్ధంతి సభలు నిర్వహించటం. అఫ్జల్ గురు కేసు పెట్టింది, సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చింది, రాష్త్రపతి క్షమాబిక్ష తిరస్కరణకు గురైంది కాంగ్రెస్ & రాహుల్ తల్లి సోనియా హయాంలోనే. అయినా సిగ్గులేకుండా బిజేపి ప్రభుత్వంతో కయ్యనికి దిగటం రాహుల్ జగడ స్వభావానికి నిదర్శనం. నమ్మక ద్రోహానికి పరాకాష్ఠ.

 

హెచ్.సి.యు; జె.ఎన్.యు లాంటి చోట్ల అరాచకాన్ని రెచ్చగొట్టటం: దేశములో ఎక్కడ అరాచకం ప్రభలినా అరవింద్ ఖేజ్రివాల్, తమ ఆగర్భ శత్రువులైన వామపక్షాల తో కలసి అధికారం కోసం కిరాతక కార్యక్రమాలు చెయ్యటం చూస్తే వీళ్ళు అధికారం కోశం దేశాన్ని అమ్మివేస్తారనే భయం కలుగుతుంది. అవసరమైతే సీతారం ఏచూరి గొంతును తన గొంతుతో పలికించగలరు రాహుల్ పంచమాగదళం. దీనికి  కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు కూడా సృష్టించి మరో దేశవిభజనకు కూడా సాహసిస్తారు. వారికి జాతి ప్రయోజనాలకంటే కుటుంబ అధికారమే ముఖ్యం. దీనికి ఉదాహరణే హెచ్.సి.యు రోహిత్, జె,ఎన్.యు

కన్-హయ్య.

 

దేశ ద్రోహులకు, ఉగ్రవాదులకు కూడా క్లీన్ చిట్స్ ఇప్పించి వైరిపక్షాలను ఇరుకున పెట్టటం: చిదంబరం లాంటి కాంగ్రెస్ నాయకుడు దేశ ప్రయొజనాల్ని ఫణంగా పెట్టి ఇష్రత్-జహాన్ లాంటి తీవ్ర-ఉగ్రవాదికి క్లీన్ చిట్ ఇచ్చి మోడీపై హత్యా ప్రయత్నం జరిపినట్లు అనుమానాలున్నాయి. అనేక వార్తా పత్రికలు, టివి చానళ్ళు కోడై కూస్తున్నాయి.

 

రాజకీయ తెంపరితనం (ఏపి విభజన సమయంలో రాజ్య సభ తలుపులు వేసి బిల్లు పాస్ చేయించటం): రాష్ట్ర విభజన చేసైనా కొన్ని పార్లమెంటరీ సీట్లు గెలవాలనే కుతంత్రం తో సమగ్ర ఆంధ్రప్రదేశ్ ను కరెంట్ తీసి, వార్తా ప్రసార చానళ్ళను ఆపి, రాజ్య సభ తలుపులు వేసి, చంద్రబాబు గారి టిడిపి లేఖ చూపి, కెసిఆర్ తో అధికార పంపిణీకి టిఆరెస్ ను కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధం చేసి, బిజేపి కి గత్యంతరం లేకుండా చేసి తెలుగుమాత పై సైద్దాంతిక అత్యాచారం చేసిన కాంగ్రెస్ కీచక, కిరాత, కంకాళకులను ఇక జాతి నమ్మితే మరల మరో స్వాతంత్ర సంగ్రామం చేయటానికి మహాత్మలు పుట్టే రోజులు కూడా కావు. ఈ అకృత్యాన్ని తెలుగు ఎం.పి లు ఎదుర్కోకుండా వైఎసార్ అత్మ కూడా ఒక బానర్ పట్టుకొని పోరాట పటిమను ప్రదర్శించిన దౌర్భాగ్యాన్ని భారత జాతి టివి లలో వీక్షించింది. ఆ అకృత్యాన్ని లిఖిత పూర్వకంగా అంగీకరించిన చంద్ర బాబు విశ్వనగర నిర్మాణ రూపములో తెలుగు నేలను తన కులజనుల నేతృత్వములో సింగపూరుకో, టోకియో కో అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇక రాహుల్ బాబు అధికారం కోసం చంద్రబాబుతో జట్టుకట్టినా ఆశ్చర్యం లేదు. 

  

ప్రజా ప్రయోజనం కలిగిన బిల్లులను కూడా తమకు బలమున్న రాజ్య సభలో అడ్దుకోవటం: ఉదాహరణకు ప్రజా ప్రయోజన మున్న దేశవ్యాప్త ఏకీకృత పన్ను విధానము ప్రవెశపెట్టటానికి మార్గములేకుండా రాజ్యసభలో అడ్డుకోవటంపై ప్రజలేమనుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోశం దేశద్రొహం చేయటానికి కూడా వెనుకాడరేమోనని ప్రజలంటున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: