సాధారణంగా వివమానాలు వాతావరణం సరిగాలేనపుడు గాల్లో ఎగరడానికి అనుమతించరు. ఒక్కోసారి సాంకేతిక లోపాల వల్ల కూడా ఆకాశంలో విమానాలకు ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. ఇలాంటపుడు వెంటనే పైలెట్స్ నేర్పుతో ఇతర సురక్షిత ప్రదేశాల్లో ల్యాండ్ చేయడం వల్ల ప్రాణాపాయ స్థితినుంచి తప్పించుకోవచ్చు. తాజాగా మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దివారం లండన్ నుంచి మలేషియాకు ఎమ్ హెచ్ - 1 విమానం బయలుదేరింది. విమానంలో 378 మంది ప్రయాణికులు ఉన్నారు.

బంగాళాఖాతం సముద్రం మీద ప్రయాణిస్తున్న సమయంలో విమానం భారీ కుదుపులకు లోనైయ్యింది. వెంటనే అందులో ఉన్న ప్రయాణీకులు ఆహాకారాలు మొదలు పెట్టారు.378 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిట్లే అని భావించారు..అంతే కాదు ఆ కుదుపుకు కొంత మంది ప్రయాణీకులకు గాయాలు కూడా అయ్యాయి. వెంటనే పైలెట్ చాకచౌక్యంతో విమానాన్ని కౌలాలంపూర్ లో ల్యాండ్ చేశారు.

గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.విమానంలో 378 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: