తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని విభజన సమయంలో పేర్కొన్నారు. అయితే గత కొంత కాలంగా తెలంగాణాకు ప్రత్యేక హైకోర్ట్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టును విభజించడం, ఆప్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లతో  తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు  లాయర్లు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో సోమవారం ఛలో హైకోర్టుకు పిలుపునిచ్చారు.

దీంతో కోర్టు దగ్గర భారీగా పోలీసుల్ని వీరిని అడ్డగించారు. హైకోర్టుకు తరలి వస్తున్న న్యాయవాదులను పోలీసులు మదీనా చౌరస్తా దగ్గరే అడ్డుకున్నారు. అంతే కాదు హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.

హైకోర్టులోని బార్ అసోసియేషన్‌లో లాయర్లు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్దసంఖ్యలో పాల్గోని హైకోర్టు ఏర్పాటుకు అనుకూల నినాదాలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: