నిస్సందేహంగా చెప్పాలంటే డా: సుబ్రహ్మణ్యస్వామి ఏవిధంగానూ అమెరికా రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ కు వ్యక్తిత్వ రీత్యా ఏమాత్రం తీసిపోరు. తను విదేశీయులెవరినీ ముఖ్యంగా ముస్లిం దేశాల వారి పొడగిట్టదు. అలాగే భారతీయులు, చైనీయులూ, మెక్సికన్లు ఎలా జాతులపై వ్యతిరేఖతతో ఆయన మైండ్ పెంట కుప్పైంది. ఐ ఎస్ ఐ ఎస్ తీవ్రవాదం వ్యతిరేఖించండి కానీ ముస్లిం సమాజాన్ని కాదు.




అలాగే ఆర్ధిక రంగ నిర్వహణలో ఒక్కొక్కరిది ఒక్కోతీరు. అలాగే రఘురాం రాజన్ రిజర్వ్ బాంక్ గవర్నర్ కాబట్టే కార్పోరేట్ దొంగల లేదా ఆర్ధిక భారతీయ విద్రోహుల పేర్లు బయటపడ్డాయి. అందరికి తెలిసినా, బాంక్ యూనియన్లు దశాబ్ధాలుగా పోరాడినా ఈ దొంగల పేర్లు ప్రభుత్వం గాని, రిజర్వ్ బాంక్ గాని, వారివల్ల కుళ్ళి కునారిల్లుతున్న బాంక్స్ గాని అధికారికంగా బయటపెట్టని విషయాన్ని రాజన్ బట్టబయలు చేసి బాంకింగ్ లో పారదర్శకత సాధించాడు. అది నిర్వివాదాంశం.


 


కాకపోతే స్వామి పెట్టుబడి దార్ల ఏజెంట్ అని భావించవలసి వస్తుంది. విజయ్ మాల్య దేశం వదలి పోయాడు. 100% రాజన్ దెబ్బకే.  పోతేపోయాడు, 9000 కోట్లతో కాన్సర్ నివారణ విషయం ఈ.డి, సి.బి.ఐ లాంటి సంస్థలు చూసుకుంటాయి. లేదా సార్వభౌమాధికారముతో ఆలస్యంగా నైనా ఇండియా నిర్ణయం తీసుకోవచ్చు. కాని దొంగల పేర్లు బయటకి రావటముతో ఎలాంటి కొత్త దొంగ సంస్థలకు బాంకులు కొత్తగా అప్పులిచ్చే పరిస్థితి లేదు. ఉన్నవాటిని నియత్రణ లోకి తేవటానికి బాంకింగ్ వ్యవస్థకు అంతర్గత సామర్ధ్యముంది.




ప్రభుత్వాలు కొన్ని కఠిన బాంకింగ్ చట్టాలు చేయవలసి ఉంది. దానితో పాటు బాంక్ ఉన్నతోద్యోగులలో ఉన్న ఇంటిదొంగల భరతం పట్టాలి. అవినీతిపరులు, అసమర్ధులు, బందుప్రీతి, అనుచరగణాలు, మార్పుకి తొందరగా అడాప్ట్ కాలేని సాంప్రదాయవాదులైన వారితో నిండిన ఈ కుళ్ళు వ్యవస్థని కడిగేసే ఎక్స్-టర్నల్ ఆడిట్ రాండం కంట్రొల్ వ్యవస్థని నిర్మించాలి. వీరికి చిక్కిన వాళ్ళకి వెంటనే కఠిన సిక్షలు విధిస్తే ఈ బాంకింగ్ వ్యవస్థలో సామర్ధ్యం వ్రేళ్ళూనుకుంటుంది.


సుబ్రమణ్యస్వామి టార్గెట్స్ రఘురాం రాజన్ - శక్తికాంత దాస్ - అరవింద్ సుబ్రమణియన్



రఘురాం రాజన్ "హృదయం అమెరికా, దేహం ఇండియా,  ఈయన్ని చిదంబరం తెచ్చాడు" ఇలాంటి వృధా మాటలు సర్వ అనర్ధాలకు మూలం. అరవింద్ సుబ్రమణియన్ తమిళ్ ఇండియన్ గా పుట్టి అమెరికాలో స్థిర పడ్డారు. అమెరికన్ అయ్యారు. ఆయన అనర్హత జాతి నిర్ణయిస్తుందా? అలా అయితే ఈ భారత జాతి ఆయనకు మంచి ఉద్యోగమో, అవకాశమో ఇచ్చి ఉంటే ఇండియాలోనే ఉండేవాదేమో? విశ్వం మొత్తం ఒక గ్రామం. ప్రజలంతా సమర్ధుల ప్రతిభతోనే విలసిల్లుతారు. ప్రతిభ ఒక వ్యక్తి, జాతి, మతం, ప్రాంతం, జెండర్ సొత్తుగాదు కాదా! 




స్వామి గారూ మీ చాందసత్వాన్ని మరచిపోయి చెత్త విమర్శలు మానండి. మీరు విమర్శించటానికిఒక అరవిందే కావాలంటే  కావలసినంత సరుకున్న రాజకీయ నాయకుడు అరవింద్ ఖేజ్రీవాల్ ఉన్నారు. మీ ముందున్న ఈ  అవకాశం ఉండనే ఉంది వాడేసుకోండి ఆయనతో ఆటాడుకోండి. మెధావులు, ప్రతిభావంతులు, విజ్ఞులు మీ చెత్త వాగుడు ను భరించలేక దేశం వదలిపోయే ప్రమాదముంది. మీకు చేతనైతే దిల్లి సిఎం ను మీ దెబ్బతో పాకిస్థాన్ పంపండి. ఇక నూక్లియర్ బాంబ్ అవసరం మనకుండదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: