అమరావతి.. ఆంధ్రుల ఆశానగరి.. అందరికీ ఉద్యోగాలు దొరకాలి.. వాణిజ్య రాజధానిగా నిలవాలి. అభివృద్ది కేంద్రంగా మారాలి. ఇదే ఆంధ్రులందరి కల. కానీ అమరావతి ప్రస్థానం ఎలా సాగుతోంది. అనుకున్న దిశగా వెళ్తోందా.. తప్పుదారి పడుతోందా.. ఈ అంశాలపై ఓ పుస్తకం వచ్చింది. 

అమరావతి సహజ నగరం పేరుతో విజయవాడలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ జలబోర్డు సలహాదారు ఆచార్య విక్రంసోని, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ ఆర్కిటెక్చర్‌ సచిన్‌జైన్‌, విశ్రాంత IAS అధికారి దేవసహాయం, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, రాజధాని ప్రాంత రైతు హక్కుల పరిరక్షణ సమితి కన్వీనరు అనుమోలు గాంధీ తదితరులు పాల్గొన్నారు. 




మహాద్బుతమైన రాజధాని నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచనను మెచ్చుకుంటూనే ఈ పుస్తకం అమరావతి మంచి చెడులను వివరిస్తుందట. సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌లో అనేక ప్రమాదకరమైన విషయాలు కనబడుతున్నాయనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరంగా రాశారట. ఒండ్రుమట్టితో కూడిన నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే కృష్ణానది ఎడారిగా మారుతుందని హెచ్చరించారట. 

కొండవీటివాగు, కృష్ణానది వరదల నుంచి భవిష్యత్తులో అమరావతిని కాపాడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారట. సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి ఎలాంటి చర్యలు లేవని ఆక్షేపిస్తున్నారు సభికులు. రైతు, రైతు కూలీల జీవన భద్రత విషయంలో స్థానిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ప్రణాళిక రూపొందించారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: