ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకూ ఆయన రష్యాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మరో 11మందితో కూడిన బృందం  రష్యా పర్యటన కు వెళ్తోంది. వాస్తవానికి బాబు రష్యా పర్యటన ఈనెల 10 వతారీఖు నుంచి ప్రారంభమవుతుంది. రష్యా పర్యటనకు ఒక రోజు ముందు తొమ్మిదో తేదీన కజకిస్తాన్ రాజదాని ఆస్తానను చంద్రబాబు సందర్శిస్తారు.

ఈనెల 10 నుంచి చంద్రబాబు రష్యాలో పెట్టుబడిదారులతోను, అక్కడి ముఖ్య నేతలతో భేటీ అవుతారని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు కృషి చేస్తారని ప్రభాకర్ వివరించారు. రష్యాలోని కజకిస్థాన్, ఎకాటెరిన్ బర్గ్, సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కోల్లో చంద్రబాబు పర్యటిస్తారు. 


చంద్రబాబు ప్రధానంగా ఇన్నోప్రోమ్ -2016 పేరిట రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అక్కడ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, వివిధ కీలక శాఖల అధికారులు కార్పొరేషన్ ల ఛైర్మన్లు రష్యా వెళ్తారు. 

ఇలా రష్యాలో జరిగే ఈ ప్రదర్శనకు చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తారట. బాబు గారి రష్యా పర్యటన బాగానే ఉంది కానీ.. గతంలోనూ చంద్రబాబు స్విట్జర్లాండ్, చైనా, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో జరిగిన అనేక సదస్సులకు వెళ్లారు. ఏ ఏ సదస్సు ద్వారా ఏఏ పరిశ్రమలు వచ్చాయో ఓ సారి వివరిస్తే.. ఇలాంటి పర్యటనకు జనం మద్దతు కూడా బాగా ఉంటుంది. ఏమంటారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: