జాకీర్ నాయక్ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఇతను భారతీయ ఇస్లాం మత ప్రభొదకుడు, ఇతర మతాలపై హీనాతిహీన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడటం, అసహ్యించుకోవటం ఈయన దినచర్య. పరమత సహనం అనేది ఈయన మనసంతా వెతికినా దాని నీడ కూడా కనపడదు. అలాంటి ఈయన కరుడుగట్టిన ఇస్లాం తీవ్రవాదముతో రెచ్చిపోయి విశ్వంపై ఉగ్రవాదం తో తీవ్ర హింసను కృమ్మరించే ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) (సంక్షిప్తంగా ఐసిస్) అసలు "ఐసిస్ అసలు ఇస్లామే కాదు" అని అభివర్ణించారు.




అంటే ఇంతకన్నా ఎక్కువ దుర్మార్గాలు చేయాలా? మానవత్వమే కనిపించని వీరిచర్యలే అన్-ఇస్లామిక్ ఐతే అసలు ఇస్లాం ఇంకా ఎంత తీవ్రత కలిగిఉండాలి? ఈ ఇస్లాం పేరిట విశ్వవ్యాప్తంగా జరిగే నరమేధం స్తాయి ఈయనకు కనిపించదా? మనుషుల్ని చంపి, స్త్రీ లను చెరిచి పసివాళ్ళను హతమార్చే ఈ సమాజాన్ని మతమనగలమా? ఇంకా ఏ ఇస్లాం పేరుతో ఏస్థాయిలో అరాచకాలు చేయాలని ఆయన ఐసిస్ నే ఉన్-ఇస్లామిక్ అంటే, ఈ పేరుతో జరిగే మారణహోమాన్ని ఏస్థాయికి తీసుకెళ్ళాలని ఈయన ఉద్ధేశ్యం. దీనిని మానవజాతి భరించగలదా? సహించగలగటం వారిచేతిలో లేనప్పుడు భరించగలిగే శక్తైనా ఉండాలిగదా?




 

భారత అంతర్జాతీయ ఇస్లామిక్ మత ప్రభోధకుడైన ఈయనను ఇతరమతాలపై ఈయనజల్లే వివాదాస్పదమైన అసహ్యకర ఉపన్యాసాల విషయములో కలత చెందిన యునైటెడ్ కింగ్-డం (యు.కె) కెనడా  ఈయనను, ఈయన ఉపన్యాసాలను ఇప్పటికే బాన్ చేశాయి. ఈయన ఉపన్యాసాలకు ప్రభావితులైన ఐదుగురు యువకులు గతవారం బంగ్లాదేశ్ రాజధానిలోని ఒక కేఫ్ లో సృష్టించిన నరమేధానికి 20 మంది ఢాఖావాసులు అతిధారుణంగా మరణంచారు. 



 

ఈయనకున్న అనేక మంది ఫేస్-బుక్ ఫాలోయర్స్ లో 14 మిలియన్ మంది బంగ్లాదేశ్ యువతే. ఈ మహమ్మద్ ప్రవక్తను, ఖురానును వాటిలోని భావ జాలాన్ని పూర్తిగా  అనుసరిస్తానని చెప్పే నాయక్ ఒక ఇస్లామిక్ హార్డ్-కొర్ ఫాలోయర్, తు.చ తప్పని మహా ఇస్లామిక్ భావజాల నియంత. వీరి ప్రవచనాలకు, టెలివిజనులో ఆకర్షితులైన బంగ్లా యువత చేసిన దుష్కృత్యాన్ని ఈయన ఖండించారు కూడా! 




మరల ఓపెన్ టాక్ లో ఇండియన్ ఎక్స్-ప్రెసు కిచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ ప్రవక్త ఎప్పుడూ మనుషులను చంపమని చెప్పలేదని, ఖురాన్ ఎప్పుడూ మానవ హననాన్ని హరించమని చెప్పలేదని అంటారు. ఏమతం వారినైనా చంపటమంటే మానవ సమాజాన్ని హతమార్చటమే నని ఇక్కడ చెపుతుంటారు. అక్కడ టెలివిజన్, వీడియో టేపులు, ఉపన్యాసాలలో మాత్రం పరమతాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు.



 

ఇలాంటి వాళ్ళు మనకు చాలామందే కనిపిస్తారు. మన హైదరాబాద్ లో బహుముఖ ప్రజ్ఞావంతుడు, విదేశాల్లో విద్యనభ్యసించిన నాగరికుడు, మన పార్లమెంటు సభ్యుడైన అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇలాంటి డబుల్-ఎడ్జుడ్-బ్లేడే. ప్రజాస్వామ్యం అభిలషించని విధంగా ప్రవర్తించే వీరిరువిరి సోదరుల వ్యవహారం సర్వదా వివాదాస్పదమే. వీరిని అనేక సార్లు ప్రశంసించే కలవకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ ప్రయోజనాలకు జాతిని బలిచేస్తున్నానని ఎప్పుడుగ్రహిస్తారో?



 

మనదేశం ఇప్పటికైన ఈ "పులితోలు కప్పుకున్న మేక"లను అదుపు చేయక పోతే దేశ సార్వభౌమత్వం ప్రశ్నార్ధక మౌతుంది. ఒక సారి మన ముఖ్యమంత్రికి కూడా కేంద్ర నిఘావర్గాలతో క్లాస్ పీకిస్తేనే మంచిది. ఆయన తన రాజకీయ అవసరాలు, పార్టీ ప్రయొజనాలు, కుటుంబ స్వార్ధం విడనాడవలసిన అవసరముంది. తక్షణం జాకీర్ నాయకును భారత్ బ్యాన్ చేయటం చాలా అవసరం. లెకుంటే ప్రపంచం మనను చూసే ధృష్టి మారుతుంది. అసదుద్దీన్ సోదరులకు, కేసిఆర్ లాంటి కుహనా రాజకీయ వాదులకు కేంద్రం ఇక ఝలక్ ఇవ్వటం నేటి అవసరం. 

 

   

మరింత సమాచారం తెలుసుకోండి: