ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి బిల్ గేట్స్ తో ఫోన్లో మాట్లాడారు. మైక్రో సాఫ్ట్ అధినేత బిల్గ్ గేట్స్‌ భార్య పేరుతో ఉన్న మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్  పేదల కోసం అనేక సేవాకార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సేవల విషయం కోసమే చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి అరగంట సేపు టెలిఫోన్ లో సంభాషించారు.  

ఇప్పటికే ఈ మిలిందా గేట్స్ ఫౌండేష్ ఏపీలో అర్బన్ శానిటేషన్, సెర్ప్ సంస్థతో ప్రభుత్వంతో కలిసి గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పేదలకు వైద్య సేవలను విస్తరించేందుకు  గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అతి తక్కువ వ్యయంతో వైద్య రంగానికి అవసరమైన సాంకేతిక పరికరాలు అందజేస్తామని బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.



ఆగస్టులో ఈ మేర మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.  ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య విభాగాల్లో విస్తరించేందుకు బిల్ గేట్స్ సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో నూటికి నూరుశాతం అన్ని విభాగాల్లో కలిసి పనిచేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.

ఆరోగ్య రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక, విజ్ఞాన భాగస్వామిగా ఉండేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి బిల్ గేట్స్ ను కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవను విస్తృతం చేయడానికి ఉత్తమ మార్గాలను సూచించాలని విజ్ఞప్తి చేశారు.  ఏపీ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో నిర్వహిస్తున్న ఇ-ప్రగతి కార్యక్రమంలో సలహాదారుగా వ్యవహరించాలని ఆసక్తిగా వున్న సంస్థల్ని భాగస్వాముల్ని చేయాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: