భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై, యువతులపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యాలయ్యాయి...ప్రతి రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడో అక్కడ మహిళలపై చివరకు చిన్నారులపై కూడా కొంత మంది కామాంధులు అత్యాచారాలు..హత్యలు చేస్తు వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రతిసారి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అంతే కాదు నిర్భయ చట్టం కూడా ప్రత్యేకంగా తీసుకు వచ్చిన విషయం తెలిసిందే..కానీ అలాంటి నీచులను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు.  భారత దేశంలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలపై  ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మద్య తల్లీకూతుళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. బరేలీ జాతీయ రహదారి సమీపంలో ఉపాధ్యాయురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలోని 24వ హైవే సమీపంలో ఓ మహిళా టీచర్ స్కూల్ కు బయలుదేరారు.  అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో చిత్రీకరించారు.  అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకు వెల్లి తుపాకీతో ఆమెను బెదిరించి అత్యచారం చేశారట.  

ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేస్తామని దుండగులు బెదిరించారని తెలిపింది.  తర్వాత జాతీయ రహదారి సమీపంలోని పొలాల్లో వదలి వెళ్లారు.  ఆధారాల కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: