మనిషి ఇప్పటి వరకు టెక్నాలజీ రంగంలో ఎన్నో కొత్త కొత్త వస్తువుల కనిపెట్టాడు కనిపెడుతూనే ఉన్నారు. భూమి,నేల, ఆకాశంలో తన సత్తా చాటాడు. అంతరిక్ష పరిశోధనలు చేసి విశ్వంలో ఉన్న రహస్యాలను ఛేదిస్తున్నాడు. ఇలా సాంకేతిక విప్లవం సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.  మనిషికి అందుబాటులోకి ఎన్నో కొత్త వస్తువులను కనిపెడుతూనే ఉన్నారు. ఇక మనిషి సాధించిన వాటిలో రోబోలు ఒకటి.  తాజాగా చైనా షాన్డాంగ్ రాష్ట్రంలోని క్విండగో సిటీలో ఎవర్ విన్ కంపెనీ బీర్ ఫెస్టివల్ లో 1007 రోబోలు ఏకకాలంలో వినూత్నంగా బ్రేక్ డ్యాన్స్ చేసి, విశేషంగా ఆకర్షించడమే కాదు గిన్నిస్ రికార్డును కూడా సాధించాయి.
Over 1,007 dancing Robots set Guinness Record in China
క్యూఆర్సీ-2 పేరున్న43.8 సెంటీమీటర్లు అంటే సుమారు 19 అంగుళాల పొడవుండే ఒకేసైజులోని రోబోలు మొబైల్ ఫోన్ కంట్రోల్ తో ఏకకాలంలో ఒకేరీతిలో డ్యాన్స్ చేయడం విభిన్నంగా ఆకట్టుకుంది. మొత్తం 60 సెకన్లలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించిన రోబోలు రికార్డును కైవసం చేసుకున్నాయి.

ప్రపంచ రికార్డును సాధించి గిన్నిస్ పుటలకెక్కాయి. ఇటువంటి వేడుకలు మరిన్ని నిర్వహిస్తామని రోబో ఫెస్టివల్ నిర్వహించిన ఎవర్ విన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.వేడుకలో భాగంగా ఎవర్ విన్ కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: