ప్రపంచంలో ఎక్కడ అవినీతి తీగ లాగినా డొంక రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఉంటోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. అగాస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో వైఎస్ ముద్దుల అల్లుడు అనిల్ కుమార్ పేరు బయటపడటమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్ తనపై అవినీతికేసుల్ని విచారిస్తున్న న్యాయమూర్తులు, రాస్తున్న పత్రికలు, టీవీలపై తన విషపత్రిక సాక్షిగా విషం చిమ్ముతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆయన వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. బారీగా తరలివచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు. వైఎస్ మొదలు పెట్టిన దోపిడీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది దొంగల ప్రభుత్వం : వైఎస్ మొదలుపెట్టిన దోపిడీని కిరణ్ కొనసాగిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. ఆ రోజునే వైఎస్ ను సోనియా హెచ్చరించి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేదికాదన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రులలో చాలామంది జైలుకి వెళ్ళకుండా తప్పించుకుంటున్నారు. లేకపోతే ఇప్పటికే సగం మంది జైల్లో ఉండాల్సిందని, మంత్రివర్గం సమావేశం జైల్లో పెట్టుకునేవారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ముఖ్యమంత్రికి కమీషన్లు వెళుతున్నాయన్నారు. సహకార ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో, ఓట్టు కొని కాంగ్రెస్ వాళ్ళు వాళ్లు గెలిచారన్నారని ఆయర మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో తెదేపా బలపరిచే ప్రభుత్వాలే వస్తాయని ఆయన ఉధ్ఘాటించారు. వారికి ప్రజలే బుద్దిచుబుతారు : ప్యాకేజీలు, సూట్ కేసులు కోసం పార్టీని విడిచి వెళ్లే నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, వాళ్లకు ప్రజలే బుద్దిచెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. కొందరు ఎమ్మల్యేలు పోయినా నష్టంలేదదన్నారు పార్టీకి ప్రాణలర్పించే కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారని ఆయన కొనియాడారు. విమర్శల్ని మీకోసం, రాష్ట్రం కోసం భరిస్తూవస్తున్నాను.. మీ హృధయాల్లో చిరస్థాయిగా ఉండిపోవాలన్నదే నా కోరిక..  ఎన్టీఆర్ చనిపోయి 17 ఏళ్ళయింది. రోజు రోజుకీ మీ గుండెల్లో ఆయన స్థానం పదిలమవుతుంది. నాకూ ఆలాంటి కోరికే ఉంది. ఎన్టీఆర్ లా మంచి పేరు తెచ్చుకోవాలి. మీకోసం, మీ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదుర్కొంటానని చంద్రబాబు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: