ఆధునిక రాజకీయాల్లో నరేంద్రమోడీ రారాజే కాదు రాజకీయ వ్యూహాల్లో చేయితిరిగిన దిట్ట. ఏం చేసినా, ఎలా చేసినా, ప్రత్యర్థులకు ఉక్కపోతే. ఊపిరాడనివ్వకూడదంతే. చేసేది తప్పయినా సరే, ఒప్పయినా సరే, తన మాటకు తిరుగు వుండకూడదు. తన పట్టు నెగ్గాలనుకునే తత్వం ఆయనది. గుజరాత్ ముఖ్యమంత్రి గా పనిచేసినప్పుడూ, దేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడూ, ఆయన వ్యూహాలకి రోజురోజుకీ పదును పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు