రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ జీహెచ్‌ఎంసీలో 2,607 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని 9వ సవరణకు కూడా ఆమోదం తెలిపింది. ఇరవై ఐదేళ్లకు పైబడిన లీజులను కూడా సమీక్షించాలని మంత్రి వర్గసభ్యులు నిర్ణయించారు. ఇందు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇంకా పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు 86 కోర్టులు, 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. పది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,599 పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని’  దృష్టిలో పెట్టుకొని  ఆయన మీడియాతో మాట్లాడుతూ..     రాష్ట్ర మహిళలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళాభ్యున్నతి కోసం ప్రభుత్వం ‘స్త్రీనిధి బ్యాంకు’ను ఏర్పాటు చేసిందని సీఎం పేర్కొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.103 కోట్లతో ‘ఇందిరమ్మ అమృత హస్తం’ పథకాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘ఇందిరమ్మ అభయ హస్తం’ను రూపొందించామని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: