అల్ ఖైదానేత ఒసామాబిన్ లాడెన్ అల్లుడు ఉగ్రవాది సులేమాన్ అబూ గేతను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. సులేమాన్ ను తాము టర్కీ, జోర్డాన్ లో అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. ఇతన్ని న్యూయార్క్ కోర్టు ముందు ఈ రోజు ప్రవేశపెడతామని అటార్నీ జనరల్ హెరిక్ హోల్డరు తెలిపారు. అమెరికా పౌరులను చంపిన కేసులో సులేమాన్ అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, అగ్రరాజ్యాలను వణికించిన అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లోని అబొత్తాబాద్ లో అమెరికా బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. అల్ ఖైదా మీడియా ప్రతినిధిగా పనిచేసిన సులేమాన్ బిన్ లాడెన్ కూతురు ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత అగ్రదేశాన్ని హెచ్చరిస్తూ అల్ జజీరా ఛానల్ లో సులేమాన్ పలు ప్రకటనలు చేసిన విషయం విధితమే.   సులేమన్ కువైట్‌లో జన్మించాడు. జోర్డాన్‌లో గురువారం పట్టుబడ్డ ఇతనిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: