మేటి సినీతార, సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయసుధ తన రాజీనామాతో రాజకీయనేతల్లో చర్చానీయంగా మారారు.  వైఎస్సార్ చోరవతో 2009లో రాజకీయ ప్రస్థానం చేసిన జయసుధ.. మొదటిసారిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థులను ఆశ్చర్యకితులను చేసిన జయసుధ.. ఇప్పుడు కాంగ్రెస్ కు దూరమవ్వాలని నిర్ణయానికి వచ్చేశారు. ఇంతకీ జయసుధ నిర్ణయం వెనుక అనేక విషయాలు దాగివున్నట్లు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా రాజకీయాలతో విసిగిపోయి దూరంగా ఉంటూవస్తున్నారు. నిజాయితీ పరులను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తే గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో పదవులను కొనుక్కుంటున్నారని ఆమె ఆవేధనను వెల్లబుచ్చారు. కొందరివల్ల రాజకీయాలంటే విరక్తి కలుగుతోందని చెపుతూవస్తున్నారు. మాజీమేయర్ బండ కార్తీకరెడ్డి దంపతులకు ఎవరికి ఎమ్మల్సీ టిక్కెట్ ఇచ్చినా పార్టీకి గుడ్ భై అంటూ చెప్పి మీడియాకు ప్రకటన ఇచ్చిన జయసుధకు కార్తీకరెడ్డి మేయర్ అయిన తర్వాత జయసుధతో సన్నిహిత్యం బాగానే ఉండేవి. ఈనేపథ్యంలోనే ఎక్కడ వీరిమధ్య చెడిందో తెలియదుగాని మాజీమేయర్ కార్తీకరెడ్డి- జయసుధల మధ్య నిప్పు మీద ఉప్పు వేస్తే అన్నంత స్థాయికి వెళ్లింది. కాగా మేయర్ పదవి కాలం ముగియడంతో పదవికోసం పాకులాడుతున్న సందర్బంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముందొచ్చిపడ్డాయి. దీంతో బండదంపతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి టిక్కెట్ ఇస్తే... కాంగ్రెస్కు గుడ్ భై చెప్పేస్తానంటూ వస్తున్న జయసుధ. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా పత్రాన్ని ఆమె ముఖ్యమంత్రికి ఈ రోజు అందజేశారు. ఏదేమయినా... ఆమె ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై రాజకీయ పార్టీల నేతలకు చర్చనీయంశంగా మారింది. రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాబట్టి, జగన్ పార్టీ వైపు వెళ్లే అవకాశము లేకపోలేదని అంటున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: