బాలికలు చదువుకోవడానికి వీల్లేదన్న తాలిబన్లతో పోరాడుతూ, వారి చేతిలో గాయపడిన సాహస బాలిక, పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(15) తను అనుకున్నది సాధిస్తోంది. పెద్ద చదువులు చదివి గొప్ప విద్యావేత్త కావాలన్న తన కోరికను తీర్చుకుంటోంది. అందులో భాగంగా ఇంగ్లాండులోని బర్మింగుహామ్ లో ఎడ్జ్ బాస్టన్ పాఠశాలలో చేరింది. భుజాన పుస్తకాల బ్యాగు తగిలించుకుని,  చిరునవ్వులు చిందిస్తూ,  నిన్నటి నుంచీ స్కూలుకి వెళుతోంది. బాలికలు చదువుకోవడానికి వీల్లేదంటూ తాము విధించిన ఆంక్షల్ని ఎదిరించినందుకు గాను, గత ఏడాది తాలిబన్లు ఆమెపై కాల్పులు జరపడం,  ఆమె తీవ్రంగా గాయపడడం వెంటనే పాక్ ప్రభుత్వం స్పందించి, ఇంగ్లాండులో ఆమెకు అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించడం మనకు తెలిసిందే. ఆ చిన్నారి ధీరత్వానికి ప్రపంచం తలవంచి సలాం చేసింది. ముష్కరులను ఎదిరించడంలో ఆ బాలిక చూపిన తెగువకు ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ళ మలాలా కుటుంబాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం బ్రిటన్ పంపించి, అక్కడ చదువుకునే ఏర్పాట్లు చేసింది!

మరింత సమాచారం తెలుసుకోండి: