ఏపీ సీఎం చంద్రబాబు తనకు తాను హైటెక్ సీఎంగా చెప్పుకుంటారు. ఆయన చెప్పుకోవడమే కాదు.. ప్రపంచంలో ఎక్కడ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని ఏపీలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తారు. ఆయనకు టెక్నాలజీపై ఉన్న మక్కువ అలాంటింది. అందుకే కృష్ణా జిల్లా దేశంలోనే ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల జిల్లాగా ఇటీవల పేరు తెచ్చుకుంది.



అంతవరకూ బాగానే ఉంది. కానీ టెక్నాలజీతోనే అంతా మారిపోతునుకోవడం కూడా ఓ భ్రమే. సరిగ్గా ఏపీ విషయంలోనే ఇది మరోసారి రుజువవుతోంది. ఏపీ అవినీతిలోనూ దేశంలోనే టాప్ స్టేట్ గా పేరు తెచ్చుకుంటోంది. గతంలో అనేక జాతీయ నివేదికలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఇప్పుడు సాక్షాత్తూ ఏపీ సర్కారు మిత్రపక్షనేత ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. 


ఏపీలో ప్రభుత్వ అధికారుల్లో అవినీతి బాగా పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు. సీఎం చంద్రబాబు సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే అవినీతిపరుల వల్ల పరువు పోతోందని ఆయన ఆవేదన చెందుతున్నారు. చివరకు సీఎం చంద్రబాబునాయుడైనా సరే ఇల్లు రిజిష్ర్టేషన్‌ చేసుకోవాలంటే రాష్ట్రంలో లంచం ఇవ్వక తప్పదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 



ఏపీలో అవినీతి పరిస్థితి అంత దారుణంగా ఉందని అంతలా రాజ్యమేలుతోందని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. చివరకు అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులకు పట్టిస్తే.. రూ.10 వేలు నజరానాగా ఇస్తానని ఆఫర్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు.. ప్రధాని మోదీతో ఫొటో దిగే ఏర్పాటు కూడా చేస్తానని ఊరిస్తున్నారు. మరి మీరేమైనా ట్రై చేస్తారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: