president trump images కోసం చిత్ర ఫలితం

నేటి నుంచి అమెరికాలో ప్రజాపాలన తిరిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పరిపాలన అధికారం ప్రజల వద్దకే వచ్చిందన్నారు. "కేపిటల్ హిల్" వేదికగా అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ట్రంప్ ప్రసంగించారు. ప్రభుత్వం ఏ పార్టీలో ఉన్నది కాదు.. ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉందన్నారు. దోపిడీ, దందాలు ఇప్పటితో ఆగిపోతాయి. "అమెరికన్, అమెరికా ఫస్ట్" అనేదే మానినాదమని పేర్కొన్నారు. ఈ విజయం అమెరికన్లదే అని చెప్పారు. అమెరికన్ల చేతుల మీదగానే అమెరికా పునర్నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. 


president trump images కోసం చిత్ర ఫలితం

వట్టిమాటలు కట్టిపెట్టి పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తానని స్పష్టం చేశారు. దేశమే అందరికీ తొలి ప్రాధాన్యం కావాలన్నారు. అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. "ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైనవారు ఇక ఎంతోకాలం నిర్లక్ష్యానికి గురికారు" అని పేర్కొన్నారు. నేటి నుంచి దేశంలో ప్రజాపాలన తిరిగి వచ్చిందని అన్నారు. 


president trump from capital hill images కోసం చిత్ర ఫలితం

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని పనులను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం ఉందన్నారు. రంగు ఏదైనా అందరీ రక్తం ఒకటే. వట్టిమాటలు కట్టిపెట్టి పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అమెరికా వస్తువులనే కొనండి, అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకొండి. విద్వేషాలు లేని దేశభక్తిని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. కోల్పో యిన ఉద్యోగాలను అమెరికన్లకు మళ్ళీ తీసుకొస్తా. మన ఉద్యోగాలు, మన సంపద మళ్లీ వెనక్కి తీసుకువస్తా. ఇస్లామిక్ టెర్రరిజాన్ని భూమిపై లేకుండా చేస్తానని తేల్చిచెప్పారు. అమెరికా గమ్యాన్ని మనమంతా కలిసి నిర్ణయిద్దామని పిలుపు నిచ్చారు.


సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: