అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడ్డాడు. ఏదో నోటికొచ్చింది చెప్పినట్టు కాకుండా.. ఆలస్యం చేయకుండా పనిలో దిగిపోతున్నాడు. అగ్రరాజ్యంలోకి అక్రమ వలసదారుల రాకను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో భారీ గోడను నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా చర్యలు ప్రారంభించాడు. 

Image result for trump mexican wall
మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తొలి అడుగు వేశారు. 3వేల200కిలోమీటర్ల పొడవుండే సరిహద్దు వెంట భారీ గోడ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభిస్తూ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. వాషింగ్టన్ లోని అమెరికా హోంశాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే దిశగా మరో ఆ దేశంపైనా సంతకం చేశారు.

Image result for trump mexican wall
అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. సమాఖ్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వలసదారులకు రక్షణ కల్పిస్తున్న నగరాలకు ప్రభుత్వ నిధుల ప్రవాహాన్ని అడ్డుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ట్రంప్  నిర్ణయాలు అక్రమ వలసదారుల్లో కలవరం రేపుతున్నాయి. 

Image result for trump mexican wall
అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఈ గోడ నిర్మాణం ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది. చెప్పడానికి బాగానే ఉన్నా ఈ గోడ నిర్మాణం అంత సులువైన పనేమీ కాదు.. అందుకు భారీగా  ఖర్చవుతుంది. భూసేకరణ కూడా అంత ఈజీ కాదు. ఐతే.. గోడ నిర్మాణ ఖర్చును మెక్సికో నుంచి రాబడతామని ట్రంప్  చెబుతున్నాడు. చివరికేమవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: