శశికళపై తిరుగుబాటు చేసి తమిళనాట రాజకీయ సునామీ సృష్టించిన అమ్మ విథేయుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యూహం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. తమిళరాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో ఆయన స్తబ్దుగా ఉండి.. రాజీనామా కూడా సమర్పించిన తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత తిరుగుబాటు చేసిన వ్యూహం అంతుబట్టకుండా ఉంది. 

Image result for ops press meet

అకస్మాత్తుగా మంగళవారం రాత్రి తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వం బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే పన్నీర్ సెల్వం శిబిరంలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రిగా మూడుసార్లు సీఎం కుర్చీలో కూర్చున్నా ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు శశికళ తన సత్తా చాటుకున్నారు. 

Image result for ops mlas

అన్నాడీఎంకే శాశనసభాపక్ష సమావేశంలో దాదాపు 130 మంది పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్నిబట్టి చూస్తే పన్నీర్ సెల్వం బలం 3 కాగా.. శశికళ బలం 130గా కనిపిస్తోంది. ఐతే.. పన్నీర్ సెల్వంలో కనిపిస్తున్న మొండి దైర్యానికి కారణం మాత్రం అంతుబట్ట కుండా ఉంది. పన్నీర్ సెల్వం .. తాను కొత్త పార్టీ పెట్టననీ.. అన్నాడీఎంకేలోనే ఉంటాను అని కుండబద్దలు కొడుతున్నారు. 

Image result for tamilnadu governor


ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని, ఎమ్మెల్యేలను కూడగట్టుకున్న తర్వాత గవర్నర్ ను కలుస్తానని, కొద్ది రోజుల్లోనే బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. మరి కేవలం ముగ్గురు సభ్యుల మద్దతు ఉన్న పన్నీర్ మెజార్టీ నిరూపించుకునేందుకు ఏ మంత్రం వేస్తారు.. ఆయన వ్యహం ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: