ప్రపంచం మొత్తం తనవైపు చూడాలని ఉత్తర కొరియా  అధ్యక్షులు కిమ్ జాంగ్ పలుమార్లు క్షిపణి ప్రయోగం చేశామని బాహాటంగానే చెబుతున్నారు.  తాజాగా ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లానికి ప్ర‌యోగించ‌గ‌లిగే బాలిస్టిక్ మిస్సైల్‌ను తాము విజ‌యవంతంగా ప‌రీక్షించిన‌ట్లు ఉత్త‌ర కొరియా స్ప‌ష్టంచేసింది.  ఇప్పటికే పలుమార్లు క్షిపణి ప్రయోగం విజయవంతంగా చేశామని చెబుతున్న ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ మిస్సైల్‌ను తాము విజ‌యవంతంగా పరీక్షించినట్లు తెలిపారు.  

ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ ప‌రీక్ష‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించిన‌ట్లు కొరియ‌న్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వెల్ల‌డించింది.  అయితే దీనిపై స్పందించిన అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా కలిసి ఉత్తర కొరియా విషయంలో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రత మండలిని సంప్రదించాయి. మరోవైపు ఉత్తర కొరియా తాము క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేసింది.
అందుకే అంతటి శక్తి...
ఈ క్షిప‌ణి తూర్పు దిశ‌గా జ‌పాన్ స‌ముద్ర తీరం వైపు 500 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిందని అమెరికా, ద‌క్షిణ కొరియా తెలిపాయి. ఈ మిస్సైల్ గ‌రిష్ఠంగా 550 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరింద‌ని సౌత్ కొరియా మిలిట‌రీ వెల్ల‌డించింది. జ‌పాన్‌లోకి మిస్సైల్ దూసుకెళ్లే ప్ర‌మాదం ఉండ‌టంతో దీనిని త‌క్కువ దూరానికే ప‌రీక్షించార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 7.55 గంట‌ల‌కు పాంగ్‌యోన్ ఎయిర్‌బేస్ నుంచి ఈ క్షిప‌ణిని పరీక్షించారు. ఇక  ఈ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంత‌మవ‌డంపై నార్త్ కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంతృప్తి వ్య‌క్తంచేశార‌ని వెల్ల‌డించింది.  అంతే కాదు క్షిపణి ప్రయోగం, కిమ్‌ జోంగ్‌ నవ్వుతూ ప్రయోగాన్ని తిలకిస్తున్న ఫొటోలను కూడా న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: