ముఖ్యమంత్రి పీఠం.. కొన్ని గంటల్లో తన వశం కాబోతోంది.. అది కూడా తాను ఒక రాజకీయ నాయకురాలు కాదు.. కనీసం ఒక్క ఎన్నికలోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నిక కాలేదు.. ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా.. వచ్చింది అదే జయలలిత ఆప్తురాలు శశికళకు.. కానీ అంతటి సదవకాశం కొద్ది దూరంలోనే చేజారిపోయింది. 


ఒక్క సుప్రీం తీర్పుతో భవిష్యత్ అంతా అంధకారమైంది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే శశికళ ఏం చేసిందో తెలుసా.. తీర్పు వినగానే భోరున విలపించింది. మంగళవారం ఉదయం టిఫిన్ చేసి ఎమ్మెల్యేలతో కలిసి టీవీ ముందు కూర్చుంది. తనకు శిక్ష పడినట్లు తెలియగానే ఐదు నిమిషాలకు పైగానే భోరున విలపించిందట. 


ఎమ్మెల్యేలంతా ఆమెను ఓదార్చారట. ఎందరు ఓదార్చినా ఆమె అరగంటపాటు దిగాలుగా నేలపైనే కూర్చుందట. ఆ తర్వాత..  తనకు శిక్ష పడినా, ‘అమ్మ’ ఈ బాధల నుంచి తప్పించుకున్నందుకు ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురైందట. ఎమ్మెల్యేలతో పది నిమిషాలు మాట్లాడిన ఆమె నాలుగైదు సార్లు కన్నీరు పెట్టుకుందట.


అయితే శశికళ కొద్దిసేపటికే కోలుకుందట. అంతబాధలోనూ ఆమె భవిష్యత్ ప్రణాళిక ఖరారు చేసిందట. తనను ఇంతగా ఇబ్బంది పెట్టిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందట. ఎమ్మెల్యేలు జారిపోకుండా వారితో అమ్మ ఫోటోపై ఒట్టు వేయించుకుందట.  పళని స్వామనిని తమ నాయకుడిగా అందరూ  అంగీకరించేలా జాగ్రత్తలు తీసుకుందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: