పన్నీర్ సెల్వం.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. ఒక్కసారి, రెండు సార్లు కాదు.. మూడు సార్లు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. నాలుగోసారి మాత్రం ఆయన సీఎం కాలేకపోయారు. శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి మరోసారి సీఎం అవ్వాలని కలలు కన్నారు. కానీ అనూహ్యంగా ఆయన ప్లాన్ బెడిసికొట్టింది. 


శశికళ తాను సీఎం కాలేకపోయినా.. తనను ఇబ్బంది పెట్టిన పన్నీర్ సెల్వం సీఎం కాకుండా జాగ్రత్తపడ్డారు. తనను నమ్మిన బంటు పళనిస్వామిని శాశనసభాపక్షనేతగా ఎంపికే చేశారు. తగిన మెజారిటీ ఉండటం వల్ల పళనిస్వామి సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయకుండా ఉండి ఉంటే సీఎం అయి ఉండేవారన్న వాదన వినిపిస్తోంది. 


శశికళ కోసం సీఎం పదవికి పన్నీర్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆ రాజీనామాకే కట్టుబడి ఉండి శశికళ సీఎం అయ్యేందుకు సహకరించి ఉంటే.. ఇప్పుడు ఆయనకు మరోసారి సీఎంగా అవకాశం వచ్చి ఉండేది. శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే సుప్రీంకోర్టు వచ్చేది.. శశికళ తప్పకుండా సీఎం కుర్చీ నుంచి జైలు ఊచల వెనక్కు వెళ్లి ఉండేది. 


అప్పుడు మరోసారి పన్నీర్ సెల్వాన్నే ఆమె తమళనాడు సీఎంగా ప్రకటించి ఉండేది.. కానీ పన్నీర్ సెల్వం అనూహ్యంగా ఎదురుతిరిగి శశికళకు విరోధి అయ్యాడు. ఇప్పుడు శశికళ సీఎం కాకపోయినా సీఎం కాలేని పరిస్థితి తెచ్చుకున్నాడు. అనూహ్యంగా పళనిస్వామిని ఇప్పుడు సీఎం పదవి వరించబోతోంది. తమిళనాడు రాజకీయ చదరంగం భలే మలుపులు తిరుగుతోంది కదూ. 


మరింత సమాచారం తెలుసుకోండి: