Telugu states politics hd imagea కోసం చిత్ర ఫలితం


వ్యక్తుల అభిష్టాలు వ్యవస్థకు అంట గట్టటం దానికి జాతి మత కుల లేబుల్ వేసి రాజకీయాలు చేయటం అంతర్జాతీయంగా రాజకీయాలు వృత్తిగా బ్రతికే వాళ్ళు చేసే నిర్వాకం. జాతి వివక్ష రెచ్చగొట్టే డొనాల్డ్ ట్రంప్ లాంటివాళ్ళే మత వివక్షతో ఉన్మాదు లను తయారు చేయటానికి ఎలాంటి తేడాలేదు. ఐఎస్ ఐఎస్ ఇస్లామిక్ మతోన్మాదం రెచ్చగొట్టి మానవులను విడగొట్టి ధారుణ మారణ హోమం చెస్తుంటే - ఇక్కడ ట్రంపెట్స్ మనుషుల రంగుతో శ్వెతజాతి దురహంకారం నిద్రలేపి వర్ణ వివక్ష తో ఉన్మాదు లను తయారు చెస్తున్నారు.


అలాగే, తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 1000 రోజులు దాటినా ప్రజల ఆర్తి ఏమాత్రం నెరవేరకపోగా ఒకే కుటుంబం లోని నలుగురువ్యక్తులు అత్యున్నత రాజకీయ పదవులు పొంది విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నది  చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ వాషింగ్టన్ స్థాయిలో అభివృద్ది పరుస్తానని మాటయిచ్చి మాట తప్పిన ఈ వ్యక్తులు రాష్ట్ర విభజన చేసి నిట్టనిలువునా కలసి బ్రతికే తెలుగు వాళ్ళని విడగొట్టారు.


Telugu states politics hd imagea కోసం చిత్ర ఫలితం


బంగారు తెలంగాణా ఏర్పడుతుందని ఇంకా నమ్మితే, వాళ్ళు జోకర్లే. అందరు కలసి ఉద్యమం చేసిన ఉద్యమ నేతలనే అధికార పీఠానికి దగ్గరకు రానీయనిస్తే తాము కబ్జాచేసుకున్న తెలంగాణా మిఠాయి ముక్కనో మాంసం ముక్కనో వారుకూడా పంచుకుని తమకుదక్కిన అధికారం కించిత్తైనా తక్కువై  పోద్దేమోనని బయపడు తున్నారు కెసిఆర్ కుటుంబ సభ్యులు.


తెలంగాణా రాష్ట్ర సమితికి అధికారం చిక్కగానే దాని మూలమైన ఉధ్యమాలపై రోత పుట్టిందా? నాటి విగ్రహాల ద్వంసం కేసుల పై నేడు గెలుకుడు ఎందుకు మొదలైంది? నాటి 'తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటి ' క్లుప్తంగా టి-జాక్ వ్యవరించిన తీరే, జ్వలింపజేసిన ఉధ్యమమే ఆంధ్ర తెలంగాణా విభజనకు ఆధారం, మూలం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.


Telugu states politics hd imagea కోసం చిత్ర ఫలితం


ఇందులో కలవకుంట్ల చంద్రశేఖరరావు, కోడండరాం మొదలు కొని ఉద్యమంలో నేటి మంత్రి మండలి శాసనసభ్యులలో “అవకాశవాదులు, పదవుల కోసం గోడ దూకిన వారు తప్ప” అందరూ పాల్గొని తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక అధికారాన్ని టిఆరెస్ రూపంలో చేజిక్కించుకుని అనుభవిస్తున్నవారే.


ఎటొచ్చి అమరజీవులైన వారిలో అతికొద్ది మంది కుటుంబాలకి ప్రయోజనాలు లభించగా - కష్ఠపడి రాత్రనక పగలనక శ్రమించిన కోదండరాం లాంటివాళ్ళకు ఎలాంటి రాజకీయ అవకాశాలు దక్కకుండా చేసి కేసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అధికారాన్ని హైజాక్ చెసి, కుటుంబములో అందరూ అధికారాన్ని అనుభవిస్తూ నేడు నాటి ఉద్యమ దోషులెవరు? అని ప్రశ్నించటం అత్యంత జుగుప్సాకరమైన ధారుణాతి ధారుణం.


Telugu states politics hd imagea కోసం చిత్ర ఫలితం


నిజం చెప్పాలంటే నేడు వీరు అనుభవించే పదవీ అధికార వైభవానికి జన్మనిచ్చిన తల్లి మర్మస్థానంపై పదవి అధికారాంధ కారం తో తన్నటం అన్నమాట.


కాంగ్రేస్ ఒక మగతనం లేని పార్టి. తెలుగుదేశం ప్రత్యక్షంగానే ఒక టిఆరెస్ ఎమెల్సికి ఒక ఎమెల్యే ద్వారా లంచం ఇవ్వటం టిడిపి నాయకుడు చంద్రబాబు ప్రమేయం కళ్ళకు కట్టినట్లు భారత జాతికి టెలివిజన్లు ప్రసారం చేసేలా కెసిఆర్ తన రాష్ట్ర ఏసిబి ద్వారా చంద్రబాబును బుక్ చెయించి తనకు వీలున్నట్లు ఏవిధంగా బడితే ఆవిధంగా అవసరమైతే వాడుకునేలా తయారుచెసేశాడు. దీంతో చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో తన రాష్ట్ర మందీ మార్బలం ద్వారా తెలంగాణా ముఖ్యంగా హైదరాబాద్ వదలి పారిపోయాడు. నిజంగా చెప్పాలంటే కెసిఆర్ పాదాల చెంత టిడిపి పచ్చి బానిసని చెప్పవచ్చు.


Telugu states politics hd imagea కోసం చిత్ర ఫలితం


ఏసిబి లాంటి అధికార వ్యవస్థను తెలంగాణా అభివృద్ధికి కాక తన అధికార రక్షణకు కాపలా కుక్కలా వాడుకొనే నీచస్థాయికి తీసుకొచ్చాడు. వ్యవస్థలు అన్నీ అధికార పార్టి చతుష్టయానికి బానిసలుగా మారిపోయాయి. ఇంత కాలం అంటే ఒక పుష్కర కాలం పైగా చెసిన చేయించిన ఉద్యమం వెనుకనున్న రాజకీయ దృక్కోణం ఉద్యమ అనుచరులను ఆయన బాషలో చెప్పాలంటే బొందపెట్టే సంస్కృతి ని విస్తృతంగా పెంచుకున్నారు. 


తెలుగు రాష్ట్రాలు కొందరి స్వార్దానికి విడిపోయాక ఎవరి పద్దతిలో వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలను పాలించుకుంటున్నారు. ఎడతెగని సమస్యలు ఆయా రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నాయి.  విభజనానతరం తెలంగాణాలో కెసిఆర్ అంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలు కొన్నైనా ఈ 1000 రోజుల పాలనలో ఈ ప్రభుత్వాలు నెరవేర్చకుండా ఏదో ఒక రకంగా మాయమాటలతో తమ సహజ సిద్ధమైన గారడితో నెట్టుకొస్తున్నాయి అధికారం లో ఉన్న రాజకీయ పార్టీలు.


kodandaram కోసం చిత్ర ఫలితం


రెండు రాష్ట్రాల్లోనూ నివురు గప్పిన నిప్పులా ప్రజల హృదయాల్లో నిద్రాణంగా ఉన్న కోరికల సాధన తీవ్రరూపం దాలుస్తూ ఒక్కొక్కటి లావాలా పెల్లుబుకుతున్నాయి. బయటికి వస్తున్న వాటిలో ముఖ్యంగా తెలంగాణా జెఎసి తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి లభించకపోవటం. ఇందులో విద్యార్థులు ఎవరైనా పాల్గొంటే అనవసరంగా భవిష్యత్తు లో చిక్కుల్లో పడతారు అని పోలీస్ ఉన్నతాధికారులు రాజకీయనాయకుల్లా అధికార పార్టీకి ప్రతినిధుల్లా చెప్పడం పలు విమర్శలకు దారి తీయటమే కాదు ప్రజాస్వామ్యాన్నె అపహస్యం చేసేలా ఇంది.


ప్రజాస్వామ్యంలో చట్టానికి లోబడి నిరసన తెలపడాన్ని నేరంగా భావించటం అతి భయానక పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఉన్న రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాలరాసే ఉద్యమ జనిత ప్రభుత్వ పాలన లో జరగటం చూసి ప్రజలు, ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. తెలంగాణా రాష్ట్రం సాధించుకుంది ఎలానో మరిచిపోయుంటే ఒకసారి మన గతంలోకి మనం తొంగిచూస్తే చాలు అంతా అర్ధమౌతుంది.


chandrababu jagan కోసం చిత్ర ఫలితం


ఇలా అణిచివేత ధోరణి ఎంత మాత్రం మంచిది కాదని ఇలాంటి నియంతృత్వ పోకడల వల్ల ముందు ముందు చాలా సమస్యలు వచ్చే ప్రమాదాన్ని గుర్తించాలని కోరుతున్నారు. అయినా శాంతియుతంగా తెలపాలనుకున్న నిరసనలకు కూడా ఇలా ఆంక్షలు విధించడం పూర్తిగా ప్రశ్నార్ధకం. కెసిఆర్ తిరుమల పర్యటనలో ఉన్నకారణంగా హైదరాబాద్ నగరం మొత్తం భద్రత కట్టుదిట్టం చేసారు. కీలక నేత కోదండరామ్ ఇంటి వద్ద గట్టి పహారానే ఏర్పాటు చేసారు. తమ దాకా వస్తే కాని తెలియదు అనే రీతిలో నిరసనలు, ఉద్యమాల విషయంలో ఇద్దరు చంద్రుల వైఖరి పట్ల అంతటా వ్యతిరేకత కనిపిస్తోంది.


అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమైనట్లే కనిపిస్తుంది. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం మొండి వైఖరి అవలంబించడం ఇప్పటికి అధిక శాతం ప్రజావర్గాలకు రుచించడం లేదు. విశాఖలో మౌన నిరసనను అడ్డుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవ అది నియంత్రించడం లో బాగా సక్సెస్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ వల్లే తర్వాత చేసుకో వడానికి అనుమతి ఇస్తామన్నా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి. పైగా హోదా పక్కన పెట్టేసి ప్యాకేజీ అయినా బ్రహ్మాండంగా ఆఫర్ చేస్తారు అనుకుంటే దానికి ఇంకా చట్ట బద్ధత రావాలి అని కొత్త రాగం అందుకోవడం ఇప్పుడు మరిన్ని విమర్శ లకు అవకాశం ఇస్తోంది.


roja revanth కోసం చిత్ర ఫలితం


నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరవాత మన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుల వారు మరో అపర రాజెంద్రుడుగా రారాజు గావెలిశారు. ఆయన శాసిస్తారు అధికారులు అనుసరిస్తారు. ప్రజల గొంతు నుండి ద్వని వినిపించరాదు అనేలా సుభిక్ష పాలన చెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాచరిక పాలన నడుస్తుందా? అనే లాగా కనిపిస్తుంది. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన ఈరోజే ప్రజాస్వామ్యానికి ద్రోహం జరిగి పోతొంది నిరాఘాటంగా.


“పాలన నిరాఘాటంగా యువరాజు లోకెష్ నాయుడు గారి కనుసన్నలలో సాగిపోతుంది. బుల్లి యువరాజు కూడా రానున్న 18 సంవత్సరాల్లో యువరాజు అవటానికి కావలసిన ఐశ్వర్యం సమకూర్చుకుంటూ - దినదిన ప్రవర్ధమాన మౌతున్నారు. రానున్న ఒక శతాబ్ధం వరకు ఆంధ్రదేశం అమరావతి రాజధానిగా ఈ బాబు నాయుడు గారి సారధ్యం లో విల సిల్లటానికి ఎలాంటి ప్రతిభందకాలు లేవని "ఆంధ్ర దీపశిఖ," "నేడు" అనే వార్తా ప్రసారవాణి తనవాణి వినిపిస్తుంది.”


lokesh KTR కోసం చిత్ర ఫలితం


ఇప్పుడు రెండు సోదర రాష్ట్రాల్లో నిరవధిక నిరంకుశ పాలన నడుస్తుంది.

రాజాధిరాజ! మార్తాండతేజ! చంద్రబాబు రాజనరెంద్ర!  జయహో! విజయహో!

జయహో! కేసిఆర్ రాజ నరెంద్రా! సాహోరే! సాహో! దిగ్విజయెంద్రా!  

మనదేశానికి రికాల్ చట్టం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: