ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కోర్టుకెళ్తాం: బీఎస్పీ


ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయ్యాయని ఆరోపణలు చేస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి..రెండు మూడు రోజుల్లో ఇదే అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు ట్యాంపర్ అయినట్లు ప్రజలకు తెలుసు. ఈవీఎంలపై రెండు మూడు రోజుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ అంశంపై మేం ఖాళీగా కూర్చోలేం’’ అని మాయావతి సోమవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు.


ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే ఐదు లక్షలిస్తాం!

Image result for prashant kishor
కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు. యూపీలో ఓటమితో వారు మండిపోతున్నారు. వారు ప్రశాంత్ కిషోర్ పై పడ్డారు. తమ పార్టీ ఓటమికి కారణం ప్రశాంతే అని వారు వాపోతున్నారు. అంతేకాదు.. యూపీలోని కొన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు.. కొన్ని పోస్టర్లను అతికించారు. ‘ప్రశాంత్ కిషోర్ ను మాకు పట్టివ్వండి.. మీకు ఐదు లక్షల రివార్డు ఇస్తాం...’ అనేది కాంగ్రెస్ ఆఫీసుల బయట అతికించబడ్డ పోస్టర్ల సారాంశం.


అధికారుల ఆస్తుల లెక్కలు అడిగిన కొత్త సీఎం!


ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, తన కేబినెట్ సహచరుల ఆస్తుల వివరాలు వెల్లడించమని ఆదేశించిన ఉత్తర్ ప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ ఆ రాష్ట్ర అధికారులకి కూడా అదే హుకుం జారీ చేశారు. సోమవారం లోక్ భవన్‌లో అధికారులతో జరిగిన తొలి భేటీలోనే వారిని తమ మొత్తం ఆస్తుల వివరాలని (స్థిర, చర ఆస్తులు) ప్రకటించాల్సిందిగా స్పష్టంచేసిన యోగి ఆదిత్యానాథ్.. అందుకోసం వారికి 15 రోజుల గడువు విధించారు.


ఆ ఇద్దరు మతగురువులు భారత్ కు వ్యతిరేకం


బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్తాన్ లో కనిపించకుండా పోయి.. సురక్షితంగా భారతదేశంలోకి చేరుకున్న ఇద్దరు ముస్లిం మతపెద్దలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు ముస్లిం మత పెద్దలు అబద్ధం చెబుతున్నారని, వారు భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. 


కూలిన విమానం.. అందులో 44 మంది...


దక్షిణ సూడాన్‌లో విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో కనీసం 44 మంది ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల క్షేమం గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా మరికొన్ని వార్త సంస్థలు చాలామంది ప్రయాణికులు గాయపడినట్టు మాత్రమే పేర్కొన్నాయి. ఈ విమానం ఎక్కడికి వెళ్తోంది, ప్రమాదానికి కారణమేంటన్న వివరాలు తెలియాల్సివుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: