రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ తమిళ రైతులు చేపట్టిన ఆందోళన 19రోజుకు చేరింది. ఢిల్లీలోని జంతర్‌  మంతర్‌  దగ్గర పుర్రెలతో అర్థనగ్న ప్రదర్శన చేస్తున్నారు.  మొన్నామద్య కొంత మంది సినీ ప్రముఖులు కూడా వీరికి మద్దతు తెలిపారు.  ఇక కరువుతో అల్లాడుతూ నిరసన తెలుపుతున్న తమిళనాడు రైతుల గోడు ప్రధాని చెవికెక్కడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు.
ప్రధాని కరువు సాయం సంపన్నులకే: రాహుల్‌
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజులుగా కరువు సాయం కోసం రోడ్డెక్కిన రైతులతో మోడీ కనీసం మాట్లాడకపోవడం వారిని అవమానించడమేనన్నారు.  జంతర్‌మంతర్‌లో రైతుల ఆందోళనకు తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. నిరసన దీక్షను సందర్శించి సంఘీభావం చెప్తున్నారు.
stalin
ఆందోళనకారులను ప్రోత్సహించడంతోపాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. రైతుల దీక్షకు సంఘీభావం తెల్పిన డీఎంకే చీఫ్  స్టాలిన్‌, సీపీఐ నేత డీ. రాజా.. కాసేపు దీక్షలో కూర్చొని తమ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు రుణ మాఫీ చేసి, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌  చేశారు.
రైతుల డిమాండ్లు
ప్రభుత్వ జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని, తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నీటి కొరత ఎదుర్కొంటున్నందున తమ సమస్య పరిష్కారానికి వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నారు. \సహాయ ప్యాకేజీ కావాలి


మరింత సమాచారం తెలుసుకోండి: