ఈసీకి కేజ్రీవాల్ సవాల్..


ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై మరోసారి చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఏ మీట నొక్కినా బిజెపికే ఓటు పడినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ విషయమై విపక్షాలు అధికార బిజెపిపై విరుచుకుపడ్డాయి.


ఆ నేతపై దేశద్రోహం కేసు ఎందుకు?..


తనపై దాఖలైన దేశద్రోహం కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని తమిళనాడు ఎండీఎంకే నేత వైగో సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఆయన బెయిల్ పొందడానికి నిరాకరించారు. దీంతో న్యాయమూర్తి వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పలు ప్రజాసమస్యలపై తాను రాసిన బహిరంగ లేఖలను వైగో ‘నాన్ కుట్రమ్ సత్తుగిరేన్’ (నేను నిన్ను నిందిస్తున్నా) అనే పేరుతో 2009లో సంకలన పుస్తకాన్ని విడుదల చేశారు. 



సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై కాల్పులు...ఆరుగురికి గాయాలు


సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదాలు కాల్పులకు తెగబడ్డారు. శ్రీనగర్‌లోని పాంథా చౌక్ సమీపంలో సోమవారం జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. భద్రతా దళాలలపై రెండు రోజుల్లో జరిగిన రెండో దాడి ఇది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని సీఆర్‌పీఎఫ్ పీఆర్ఓ బి.చౌదరి తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.


భార‌త ఐటీ కంపెనీల‌కు సింగ‌పూర్ షాక్‌

 ఇండియ‌న్ ఐటీ కంపెనీల‌కు మ‌రో దెబ్బ త‌గిలింది. సింగ‌పూర్ కూడా అమెరికా బాట‌లోనే వెళ్తున్న‌ది. తమ దేశంలో ఉన్న భార‌త ఐటీ కంపెనీలు స్థానికుల‌కే అవ‌కాశాలు ఇవ్వాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. భార‌త ఐటీ ప్రొఫెష‌నల్స్‌కు జారీ చేసే వీసాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. దీంతో ఐటీ కంపెనీలు ఇత‌ర దేశాల వైపు చూస్తున్నాయి. అటు వాణిజ్య ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని భావిస్తున్న భార‌త ప్ర‌భుత్వం.. కాంప్రెహెన్సివ్ ఎక‌న‌మిక్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్(సీఈసీఏ) పునఃస‌మీక్ష‌పై పునరాలోచ‌న చేస్తున్న‌ది. 

మెట్రో స్టేషన్లలో పేలుళ్లు, 10మంది మృతి..


ష్యాలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని మెట్రో స్టేషన్‌లో పేలుళ్ల జరిగి పదిమంది దుర్మరణం చెందగా, మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ఎక్కడివారు అక్కడ భయంతో పరుగులు తీశారు.  పేలుళ్లతో సుమారు పదిమంది ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: