తమిళనాడులో గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో ఎన్నో సంక్షోభాలు చెలరేగాయి.  దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆమెకు నమ్మిన బంటు పన్నీరు సెల్వం..అమ్మ నెచ్చెలి శశికళ మద్య పెద్ద యుద్దం జరిగింది.  సీఎం పదవి కోసం ఎవరికి వారే ఎన్నో వ్యూహాలు పన్నారు.  కానీ అనుకోకుండా అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించగా..సీఎం పదవికి రాజీనామా చేసి పన్నీరు సెల్వం కొత్త చిక్కులు తెచ్చుకున్నాడు.  ఏదిఏమైనా శశికళ వర్గానికి చెందిన పళని స్వామి కి తమిళనాడు సీఎం పీఠం దక్కింది.
అమ్మ లేరనే ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు
 అప్పటి నుంచి అన్నాడీఎంకే లో చీలిక ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆర్.కె. నగర్ లో ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యం పన్నీరు సెల్వం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం శశికళ వర్గానికి చెందినవారైతే.. మరోవైపు ఓపీఎస్ వర్గం నువ్వానేనా అన్నట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  అయితే ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా అన్నాడీఎంకే ఏర్పడిన చీలికను మళ్లీ కలుపుతాయని.. కొద్ది రోజుల క్రితం అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ అన్నారు.  
శశికళ అండ్ కో ను సాగనంపి
తాజాగా శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు అందరూ త్వరలో తన వర్గంలోకి వచ్చేస్తారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ( పురుచ్చి తలైవి అమ్మ) పార్టీ నాయకుడు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అాన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీర్ సెల్వం. అధికారం దూరం అయినా సరే ఇప్పుడు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే లక్షంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: