భారత దేశంలో గత కొంత కాలంగా ఆధార్ కి సంబంధించిన వార్తలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.  ముఖ్యంగా సంక్షేమ పథకాలు లబ్ది పొందాలంటే ఆదార్ తప్పని సరి అంటున్నారు ప్రభుత్వ శాఖలు.  అయితే భారత దేశంలో చాలా మంది వరకు ఆదార్ లేకుండా ఉండటాన్ని కూడా తప్పు బడుతున్నారు.  భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ ఆధార్ ని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని అంటున్నారు.  తాజాగా ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా ఆధార్ ప్రభావం పడింది.

 ఆధార్ విషయంపై బ్యాంకు, ఫైనాన్సియల్ అకౌంట్ హోల్డర్స్ కు  ఆదాయపు పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేసింది. 2014 జులై 1-2015 ఆగస్టు 31 మధ్య బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్, స్టాక్ వంటి అకౌంట్లు తెరచినవారు తప్పనిసరిగా ఈ నెల 30 లోగా ఆధార్ ను తమ ఖాతాలకు లింక్ చేయాలని ఆదాయం పన్ను శాఖ సూచించింది. లేకపోతే వారి ఖాతాలు బ్లాక్ అవుతాయని హెచ్చరించింది. బ్యాంకులకు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు ఆ అకౌంట్లను బ్లాక్ చేసే అధికారముంటుందని ఐటీ శాఖ తెలిపింది.
Image result for aadhar
ఒక్కసారి వివరాలన్ని సమర్పించిన అనంతరం ఎప్పటిలాగే అకౌంట్లను ఆపరేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ చట్టం కింద అమెరికా, భారత్ రెండు దేశాలు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి  వీలుంటుంది. ఏప్రిల్ 30 లోగా సెల్ఫీ సర్టిఫికేషన్ సమర్పించాలని, లేని పక్షంలో మీ అకౌంట్లను బ్లాక్ చేస్తామని, ఇలా చేస్తే అకౌంట్ హోల్డర్లు తమ లావాదేవీలు  జరుపుకోవడానికి వీలుండదని ఆదాయంపన్ను శాఖ పేర్కొంది. ఈ అకౌంట్లలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, స్టాక్స్ అన్ని కలిసే ఉంటాయని తెలిపింది. ఈ ఎఫ్‌ఏటీసీఏ ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ గడువులోగా ఆధార్ నెంబరు సమర్పించాల్సిందేనని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: