ఈ మద్య చిన్ని పిల్లలు మారాం చేస్తే వారికి ఇష్టమైన బొమ్మలు కొనించి ఇస్తున్నారు.  కాస్త డబ్బులున్న వారు   బైకులు, కార్లు అంటే వాటిపై కూర్చొని నడిపించే విధంగా ఉండే  బొమ్మలు ఇప్పిస్తున్నారు.    ఈ మద్య ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సిబ్బంది వాహనాలు నడిపే వారిపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు.   చాలా నగరాల్లో వాహనాలు తాగి నడుపుతున్నారన్న కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా బుక్ చేస్తున్నారు.  ఇక రోడ్డుపై వాహనాలు నడిపేటపుడు ఏమాత్రం  సిగ్నల్స్ దాటినా వెంటనే జరిమానా వేస్తున్నారు.  

తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసు బొమ్మకారు నడుపుతున్న మూడేళ్ల బాలుడికి చలానా వేసిన ఆస‌క్తిక‌ర‌, సరదా ఘ‌ట‌న కెన‌డాలో చోటు చేసుకుంది.    నాథన్ అనే చిన్నారి తన బొమ్మకారును తీసుకొని వారి ఇంటి ముందు రోడ్డుపై అటూ ఇటూ తిప్పుడూ ఆడుకుంటున్నాడు. అది చూసిన ఓ పోలీసు వెంట‌నే ఆ బాలుడి ద‌గ్గ‌ర‌కు వచ్చి వేగంగా న‌డిపిస్తున్నావంటూ చలాన్‌ రాసి ఇచ్చాడు. దీంతో నాథన్ తల్లికి బుర్ర తిరిగింది..అదేంటీ ఇంత చిన్న పిల్లాడికి చలానా..? అంటూ ఆశ్చర్యపోయింది.

 అయితే, ఆ పోలీసులు డబ్బులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ట్రాఫిక్‌ ఉల్లంఘనకు తొలి చలాన్‌ను అందించామ‌ని, ఇది స‌ర‌దాగానే చేశామ‌ని అన్నాడు. నాలుగేళ్ల పాటు తల్లికి బట్టలు ఉతకడంలో సాయం కూడా చేయాలని ఆ బాలుడికి శిక్ష విధిస్తున్న‌ట్లు చెప్పి వెళ్లిపోయాడు.  అయితే అంత చిన్న వయసులో  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్య‌క్తిగా నాథ‌న్‌ వార్త‌ల్లోకెక్కాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: