చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కారు మరోసారి సత్తా చాటింది. మరో అంతర్జాతీయ సంస్థ ఏపీలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చింది. ప్రముఖ కొరియన్ కార్ల సంస్థ కియా ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ దాదాపు 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఫ్యాక్టరీ పెడుతుందట. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారట. 

kia cars కోసం చిత్ర ఫలితం
గతంలో హీరో కంపెనీని కూడా చంద్రబాబు ఇలాగే ఏపీకి రప్పించుకున్నారు. ఇప్పుడు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఎక్కువ రాయితీలు ఇచ్చి.. పట్టుదలతో ప్రయత్నించి కియా సంస్థను సాధించుకున్నారు. కరవు జిల్లా అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమ ఏర్పాటుకావడం శుభపరిణామమే. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 3లక్షల కార్ల తయారు చేస్తారట. 

kia cars logo కోసం చిత్ర ఫలితం

ఈ కొరియన్ కంపెనీ ఏర్పాటు ద్వారా నేరుగా పదివేల మందికి వరకూ ఎంప్లాయ్ మెంట్ దొరుకుతుందట. ఇక పరోక్షంగా ఉపాధి దొరికేవారి సంఖ్య 50 వేల మంది వరకూ ఉండొచ్చట. అనంతపురం జిల్లా పెనుగొండలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట. అనంతపురం నగరానికి 75 కిలోమీటర్ల దూరంలోని పెనుకొండ వద్ద ఈ కంపెనీ కోసం 600 ఎకరాల భూమిని అప్పగిస్తారట. 

penukonda కోసం చిత్ర ఫలితం
ఇక ఈ కియా సంస్థ హిస్టరీ ఓసారి చూస్తే.. ఈ సంస్థకు ఇప్పటికే దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏపీ ప్లాంటును 2018 చివరి నాటికి నిర్మించేస్తారట. 2019 నుంచి ప్రొడక్షన్ ప్రారంభిస్తారట. ఈ కియా ప్లాంట్ కోసం ఫస్ట్ ఫేజ్ లో 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం ఇండియాలోనే అమ్ముతారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: