తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు మరోసారి ఊహించని మలుపులు తిరుగుతున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఓ వైపు శశికళ జైలుకు వెళ్లడం..ఆమె బంధువు దినకరణ్ ని పోలీసులు అరెస్టు చేయడం తో కథ కొత్త మలుపు తిరిగింది.   అప్పటి వరకు పన్నీర్ సెల్వం  చేస్తున్న ప్రయత్నాలకు లైన్ క్లీయర్ అయ్యిందా అని అనుకుంటున్నారు.  ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పన్నీరు వర్గం చేస్తున్న డిమాండ్లపై పళని సానుకూలంగా స్పందించకపోవడం,  ఇరు వర్గాలు విమర్శలకు దిగడంతో విలీన చర్చలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విలీనం ఓ హైడ్రామా అని, కమలం పెద్దల కనుసన్నల్లో ఈ డ్రామా సాగుతోందని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు.   ఏఐఏడీఎంకే చీలిక వర్గాల విలీనంలో భాగంగా రెండు వర్గాలు రెండు కావాలని పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు చర్చలు జరపడానికి సిద్దం అయ్యాయి.
మాజీ మంత్రి
ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను దూరం పెడుతున్నామని ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని నాయకులు చెప్పారు. తాజాగా   పార్టీని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి శశికళ కొత్త ఎత్తుగడ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ తన వదిన (అన్న భార్య) ఇళవరసి కుమారుడు వివేక్‌ను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా వివేక్‌ను నియమించి, ఆయన ద్వారా చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన
చిన్నమ్మ ప్రతిపాదనకు ఆమెకు నమ్మినబంటు అయిన సీఎం పళనిస్వామి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివేక్ చిన్నతనం నుంచే పోయెస్ గార్డెన్ లో ఉండేవాడు. వివేక్ అంటే జయలలితకు కూడా చాల ఇష్టం అని సమాచారం. వివేక్ తండ్రి జయరామన్ హైదరాబాద్ లోని జయలలిత ద్రాక్ష తోట చూసుకునేవారు. జయరామన్ మరణించిన తరువాత వివేక్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. వివేక్ జాజ్ సినిమాస్ సీఈవోగా పని చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: