కశ్మీర్ యువత అసలు సమస్య నిరుద్యోగం. పోలీస్ రికౄట్మెంట్ నోటిఫికేషన్ రాగానే పోలీసులపై రాళ్ళు రువ్వటం ఆగి పోయింది. వాళ్ళకు పని కల్పించటం ప్రభుత్వానికి ముఖ్యం. ఒక్కో పోస్టుకు వెయ్యి మంది అప్లికేషన్లు పెట్టారు. అంటే అటు కాశ్మీర్ లో ఇటు జమ్మూలో అదే రేంజ్ లో ఉంది పరిస్థితి.


మహిళలు కుడా క్రిక్కిరిసిన స్థాయిలో పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నించటం వారికి ఆ ఉద్యోగంపై గల మక్కువ తెలుస్తుంది. జమ్ము కాశ్మీర్ యువత లో నెలకొన్న  నిరుద్యోగం ఆసరా చేసుకొని పాకిస్థాన్ నుండి దిగుమతైన ఉగ్రవాదం వలలో చిక్కుకొని నిర్వీర్యమౌతుంది.

Image result for j&k police dgp

ఇప్పుడు  కశ్మీర్ యువత ఆలోచనా విధానంలో క్రమంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిన్నటిదాకా జవాన్లపై రాళ్లు రువ్వినవారే నేడు పోలీసు ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.


నాలుగు రోజుల కింద ఆర్మీకి చెందిన యువ అధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫైయాజ్‌‌‌ను హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులు అపహరించి హత్యచేసిన విషయం తెలిసిందే. భద్రతదళాలల్లో చేరే కశ్మీరీ యువతకు హెచ్చరికగా ఉగ్రవాదులు ఈ దారు ణానికి పాల్పడ్డారు. అయితే వారి హెచ్చరిక లను బేఖాతరు చేస్తూ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించిన 698 ఎస్సై పోస్టు ల కు ఏకంగా 67,218 మంది దరఖాస్తు చేసు కోవడం విశేషం.


Image result for j&k police dgp

వీటికి సంబంధించిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ప్రారంభమైంది. శనివారం శ్రీనగర్‌లోని భక్షి స్టేడియంలో 2 వేల మంది యువతీయువకులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. పోలీస్ ఉద్యోగాల్లో చేరవద్దని వివిధ తీవ్రవాద సంస్థల హెచ్చరికలను పెడచెవిని పెడుతూ యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. కశ్మీరీ యువతను బెదిరిస్తూ అనేక వీడియోలను ఉగ్రవాదులు విడుదల చేస్తూన్నా వాటిని పట్టించుకోకుండా అధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.


ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో కశ్మీరీ ప్రాంతం నుంచి 35,722 మంది - 31,496 మంది జమ్ము ప్రాంతం నుంచి ఉన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 6 వేల మంది అమ్మాయిలు కూడా దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొంటారని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వెయిద్ ప్రకటించారు.

Image result for jammu kashmir youth applies for police jobs

కరుడుగట్టిన మత సాంప్రదాయిక సంకెళ్లను చేదించుకొని వందలాది మంది కశ్మీరీ యువతులు చెలీయలికట్టను చేదించుకొని ఇందులో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తీవ్రవాదం వల్ల కశ్మీర్‌లో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని ఓ యువతి పేర్కొంది.



కశ్మీర్  లోయలో పోలీసులకు నిరంతరం ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది, అయినా కానీ దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని మహ్మద్ రఫీక్ భట్ అనే యువతి తెలిపింది. అంతే కాదు తీవ్రవాదం అనే వ్యాధికి సరైన మార్గంలో చికిత్స అవసరమని వ్యాఖ్యానించింది.

Image result for jammu kashmir women applies for police jobs

పోలీస్ ఉద్యోగం వస్తే నా అంత అదృష్టవంతురాలు ఉండరు.  సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని ఫర్జానా అనే యువతి తెలియజేసింది. సమాజం ఎదుర్కొంటున్న దురాగతాలను ఎదిరించడానికి అవకాశం ఉంటుందని శ్రీనగర్‌కు చెందిన రుబీనా అక్తర్ అనే యువతి వివరించింది.

Image result for jammu kashmir youth applies for police jobs

మరింత సమాచారం తెలుసుకోండి: