మోడీ సర్కారు రామమందిర నిర్మాణంపై దృష్టి సారించిందా.. బీజేపీ నాయకుల జీవితకాల వాంఛ అయిన రామమందిర నిర్మాణం కోసం పావులు కదుపుతోందా.. పూర్తి మెజారిటీ ఉన్న మోడీ సర్కారు ఈ విషయంలో సాహసం చేసేందుకు సిద్ధమవుతోందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

దేశ అస్థిత్వం కోసం రామమందిర నిర్మాణం చేయాల్సిందేనని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి హైదరాబాద్ లో అన్నారు. రామ మందిరంపై పూర్తి హక్కుల కోసం పోరాడుతున్నామని విరాట్ హిందుత్వ సంఘం వ్యవస్థాపకుడు కూడా అయిన సుబ్రమణ్య స్వామి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  సదస్సుకు ఆయన హాజరయ్యారు. 

babri masjid before demolition pictures కోసం చిత్ర ఫలితం

చట్టపరంగా రామమందిర నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. మరో నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణంపై అనుకూల ఫలితం వస్తుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. రామమందిరంపై మసీద్ నిర్మించినట్లు ఆధారాలున్నాయని వివరించారు. 

దేశంలో హిందూ సంస్కృతి పురాతనమైందని.. మన పూర్వీకులందరూ హిందువులేనని సుబ్రహ్మణ్యస్వామి కామెంట్ చేశారు. ఎన్నో దేశాల సంస్కృతి అంతరించిపోతున్నా హైందవ సంస్కృతి మాత్రం తన గొప్పతనాన్ని చాటుకుంటోందని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: