భారత దేశంపై పాకిస్థాన్ ఎంతో కాలం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఓ వైపు శాంతి శాంతి అంటూనే..టెర్రరిస్టులకు కేంద్రంగా వ్యవహరిస్తూ..వారిని భారత్ సేనలపై ఉసిగొలుపుతుంది.  గత సంవత్సరం నుంచి ఎన్నో సార్లు భారత్ సైన్యంపై పాక్ ఉగ్రవాదులు, పాక్ సైనికులు దాడులు జరుపుతూనే ఉన్నారు.  భారత సైనికులు కూడా వారికి సరైన సమాధానం ఇస్తూ..వస్తున్నారు.  

గత సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ ఉగ్రవాదులు రెచ్చిపోయి ఏడుగురు జవాన్ల మృతి, దాదాపు 37మంది పౌరులు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం చెలరేగింది. గత రాత్రి పోలీసుల తనిఖీల్లో సైనిక దుస్తులతో కూడిన ఒక బ్యాగ్‌ దొరకడం అలజడి సృష్టించింది.
Image result for pathankot punjab
దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు సోమవారం హై అలర్ట్‌ జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి హైఅలర్ట్ ప్రకటించి బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ నెల 4న పఠాన్ కోట్ మిలటరీ స్థావరానికి కొద్ది దూరంలోనే గుర్తుతెలియని రెండు బ్యాగులు లభ్యమయ్యాయి. ఆ బ్యాగుల నుంచి మొబైల్ టవర్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: