నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. 60 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గన్ పార్క్ కు వెళ్లి అమర వీరులకు నివాళులర్పించనున్నారు.  తాజాగా తెలంగాణ యువతకు మరో శుభవార్త కూడా వినిపించింది తెలంగాణ ప్రభుత్వం.
Image result for telangana youth
రాష్ట్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని 2,437 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో గురుకుల విద్యా సంస్థల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులే 1,130 ఉన్నాయి. ఇంకా, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు 541, సివిల్‌, ఎలక్ట్రి‌కల్‌ ఏఈఈ పోస్టులు 463 ఉన్నాయి.ఈ నెల 6 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు.
Image result for telangana youth job notification
దీనికి సంబంధించిన స్కినింగ్ టెస్ట్ జూలై 16 న, మెయిన్ పరీక్షలు ఆగస్టు 12,13 న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  గురుకుల డిగ్రీ ప్రిన్సిపాల్‌, ఫారెస్టు ప్రొఫెసర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూల ప్రక్రియ నిర్వహింస్తామని చక్రపాణి వెల్లడించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: