భారత దేశంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా..ఎన్ని సార్లు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాలను సోషల్ మీడియాలో చూపించినా వారి పనితీరు మాత్రం అస్సలు మారడం లేదు.  మరోవైపు ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రుల పనితీరు పూర్తిగా మారిందని తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని ఊకదండపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.

తాజాగా కర్ణాటకలోని షిమోగా జిల్లాలో కదల్లేని స్థితిలో ఉన్న తన భర్తను అతని భార్య ఎక్స్-రే గదికి నేలపైనే ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న తన భర్త అమీర్ సాబ్ ని ల్యాబ్ కి తీసుకువెళ్లేందుకు వీల్ చైర్ గానీ, స్ట్రెచర్ గానీ ఏర్పాటు చేయాలని ఫమీదా కోరగా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.  దీంతో గతిలేక ఆమె నేలపైనే తన భర్తను ఈడ్చుకుంటూ వెళ్లిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో వైరల్ అయ్యింది.  అలా భర్తను ఈడ్చుకుంటూ వెళ్లిన భార్య పేరు ఫమిదాగా గుర్తించారు.

గత కొంత కాలంగా  ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్ళు గా మారాయని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ వారు ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడమే కానీ అక్కడ సిబ్బంది పని తీరు ఏ మాత్రం మార్చిన దాఖలాలు లేవు. దయనీయమైన ఈ వీడియో బయటపడడంతో ఈ సంఘటనపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: