సాధారణంగా జంతువులు అందులోనూ సాదు జంతువులు ఎక్కువగా గడ్డి, ఆకులు, అలములు తింటూ బతుకుతాయి.  మన ఇళ్ళల్లో సాదుకునే సాదు జంతువులు ఆవులు, మేకలు పచ్చగడ్డి తిని బతుకుతాయి. ఇక మేకలు, గొర్రెలు బయట కనిపించే ఆకులు,గడ్డి తో పాటు పేపర్లు కూడా తింటుంటాయి.  అయితే ఇప్పుడు మీరు చదవబోయే మేక మాత్రం కాగితాలు తిని పరేషాన్ చేసింది..అదేంటీ కాగితాలు తింటే పరేషాన్ కావడం ఏంటీ అనుకుంటున్నారా..! మరి ఆ కాగితాలు సామాన్యమైనవి కాదు రెండు వేల నోట్లు.

వివరాల్లోకి వెళితే..వ్యవసాయదారుడైన సర్వేష్ కుమార్ పాల్ తన ఇంటిని నిర్మించుకుంటున్నాడు.  సర్వేష్ కుమార్   గతకొంతకాలంగా ఓ మేకను పెంచుకుంటున్నాడు. దాంతో ఆ మేక సర్వేష్ కుటుంబంతో బాగా కలిసిపోయింది. కుటుంబ సభ్యులందరూ దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఈ క్రమంలో సోమవారం సర్వేష్ ఓ పని నిమిత్తం రూ. 66వేలు షర్ట్ జేబులో పెట్టి స్నానానికి వెళ్లాడు.

 మరి మేకకు ఎంతో ఆకలైందో కాని  ప్యాంటు జేబులో రంగు కాగితాలు బయటికి వచ్చి ఉన్నాయి. వెంటనే అవి లాగేసి తినేసింది. సర్వేష్ తేరుకుని చూసేసరికి కేవలం రెండే రెండు నోట్లు దాని నోట్లో ఉన్నాయి. అది చూసి సర్వేష్ నిర్ఘాంతపోయాడు. కానీ ఇంత జరిగిన మేకపై మాత్రం అతడికి కోపం రాలేదట. ఈ విషయం తెలిసి ఇరుగుపొరుగు వారు మేకను చూడటానికి ఎగబడుతున్నారు. అంతేకాదండోయ్ మేకతో తెగ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: