ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల వచ్చిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తప్పిపోయారు.  దైవ దర్శనానికి వచ్చిన కుటుంబ సభ్యులతో ఉన్న ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడం షాక్ కి గురి చేసింది. అయితే తప్పిపోయినప్పటి నుంచి ఎంత వెతికినా ఆయన ఆచూకీ దొరకనట్లు తెలుస్తోంది. దీంతో కుంజా భిక్షం సతీమణి కుంజా వెంకట రమణ తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భిక్షం కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుండగా.. గత కొంతకాలంగా ఆయనకు మతిమరుపుతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మిస్సింగ్‌.. గాలింపు
శనివారం సాయంత్రం స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు వేసే సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగటంతో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయారు. ఆయనకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా ఉండటం లేదని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.  ఆయన వియ్యంకుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర తిరుమలలో భిక్షం ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.
Image result for tirupati temple images
ఆలయం బయటి కెమెరాల్లోను ఆయన కదలికలు ఎక్కడా రికార్డవలేదు. దీనిపై కుంజా భిక్షం కుమార్తె స్పందిస్తూ.. లోపల తాము హుండీ దగ్గర ఉన్న సమయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చారని అన్నారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యను ప్రారంభించారు. అయితే 24 గంటలు గడుస్తున్నా మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభించలేదు. ఆయన క్షేమంగా తిరిగిరావాలని కుటుంబసభ్యులు ప్రార్థిస్తున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: