రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా.. అన్న చందంగా డబ్బు ఉంటే ఎలాంటి జైల్లో అయినా రాజభోగాలు అనుభవించ వచ్చని
చిన్నమ్మ శశికళ విషయంలో మరోసారి రుజువైంది. ఈ మద్య అన్నాడీఎంకే పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ మద్య శశికళ జైల్లో దర్జాగా తిరుగుతూ ఉన్న ఫ్యూజువల్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ చాలా దర్జాగా, సుఖంగా ఉంటున్నట్లుగా ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా తేలింది.
ఆమెకు ఐదు రూంల సూట్, ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేసినట్లు వివిఐపిలా ఆమె జీవిస్తున్నారు. సాధారణంగా జైలు జీవితం అనుభవిస్తున్న ఎలాంటి వారికైనా కొన్ని పనులు అప్పజెబుతారు..ఈ నేపథ్యంలో శశికళ కు కొవ్వొత్తుల తయారీ అప్పగించారు. కానీ ఆమె ఇప్పటి వరకు ఒక్క క్యాండిల్ చేయలేదు. ఆమె చేసిన డ్యూటీ వివరాలు ఏమీ లేవు.
ఇప్పటి వరకు ఆమెకు జైలు అధికారులు ఎలాంటి పని అప్పగించక పోవడం గమనార్హం. శశికళకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వలేదు. అంతే కాదు శశికళ రాజభోగాలపై తొలుత డిఐజి రూప వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే రెండు రోజుల క్రితం ఆమెను అన్నాడీఎంకే పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందేదీంతో శశికళను మరిన్ని కష్టాలు చుట్టుముట్టినట్లె తెలుస్తుంది.