పోల‌వ‌రం బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టును రాష్ట్రానికి జీవ‌నాడిగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనిని విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చి కేంద్రానికి బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. కేంద్రం ప‌నులు చేప‌డితే ఆల‌స్యం అవుతుంద‌ని భావించి తామే ఈ నిర్మాణాన్ని ద‌గ్గ‌రుండి మ‌రీ చేయిస్తున్నామ‌ని చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. దీనికిగాను ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చుకున్నారు. స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ.. అధికారులను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2018 నాటికి పోల‌వ‌రం నుంచి నీటిని కూడా విడుద‌ల చేయిస్తామ‌ని హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఇక‌, ఇంత‌లోనే కాంట్రాక్టు ప‌నుల ఆల‌స్యం, ధ‌ర‌ల పెంపు నేప‌థ్యంలో త‌లెత్తిన వివాదంతో ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయి. 

Related image

అయితే, తాజాగా గురువారం జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు. ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. ప్రాజెక్టును మెచ్చుకున్నారు. అయితే, అదేస‌మ‌యంలో ఈ నిర్మాణంపై బాబు ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌ల‌ను ఉతికి ఎండేశారు! ఎట్టిప‌రిస్థితిలోనూ బాబు చెబుతున్నట్టు 2018 నాటికి పోల‌వ‌రం పూర్తికాద‌ని అన్నారు. అదేవిధంగా కేంద్రం డ‌బ్బులిస్తున్న‌ప్పుడు లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం రాష్ట్రంపై ఉంద‌ని అన్నారు. మొత్తంగా చూసుకుంటే.. త‌న‌ పార్టీకి మిత్రుడ‌ని బాబు ప‌దేప‌దే చెబుతున్న ప‌వ‌న్ ఇలా వ్యాఖ్యానించ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. అయితే, ప‌వ‌న్ నిజాలే చెబుతుండ‌డం ఏం చేయాలో తెలియ‌క టీడీపీ నేత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. 

Image result for pawan kalyan polavaram visiting

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం   పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు..  2018 లోపు పోలవరం  పూర్తవుతుందనేది శుద్ధ అబద్దమని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పోలవరం విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారిందని  ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో 125 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు కానీ ఇప్పుడది 50 వేల కోట్లకు ఎందుకు చేరిందో ఆలోచిస్తానన్నారు.. పోలవరం విషయంలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని స్ప‌ష్టం చేశారు. 

Image result for pawan kalyan polavaram visiting

కేంద్రానికి సరైన లెక్కలు చూపించలేకపోవడమే వివాదానికి దారితీసిందన్నారు. కేంద్ర ప్రభుత్వమన్నాక ఇచ్చిన ప్రతి పైసాకు లెక్కలు అడుగుతుంది అంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం పనులు నిలిపివేయాల్సి అవసరమేముందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఏ పార్టీకో ఏ వ్యక్తికో కాదని ప్రజల అవసరాలు తీర్చడం కోసమని గుర్తుచేశారు.  మొత్తంగా పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ప‌వ‌న్ వైఖ‌రి ఇంత సూటిగా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు ఈ కామెంట్ల‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: