మణిశంకర్‌ అయ్యర్‌! గురించి చెప్పాలంటే ఆయన పాత్ర మహాభారతం లో శల్యుని కంటే ఎక్కువ శకునికి కంటే తక్కువ. కాని ఈయన శకుని స్థాయికి చేరాలనేది ఆయన జీవితేచ్చ కావచ్చు. బాజపాలో ఉన్న నరెంద్ర మోదీ, కాంగ్రెస్ లో ఉన్న మణిశంకర్ అయ్యర్ల  సదాశయం ఒక్కటే. ఆయన కాంగ్రెస్ ముక్త భారత్ కొసం బాజపా నుండి శ్రమిస్తుంటే ఈయన అదే పని అతి సునాయాసంగా కాంగ్రెస్ లో ఉండి చేసే స్తున్నారు.

Related image

అందుకే ఆయన్ని "బీజేపీని గెలిపించే కాంగ్రెస్‌ నేత" అని చెపుతారు. ఉదహరణకు మణి శంకర్ కారణం గానే గుజరాత్‌ లో సుధీర్ఘ యాంటీ ఇంకంబెన్సీని చేదిస్తూ మరోసారి బీజేపీని విజయతీరం వైపు నడిపించారు. కాంగ్రెస్‌ ఓటమికైతేనేమిటి బిజెపి విజయానికైతేనేమి అటు మోదీ తోపాటు ఇటు మణిశంకర్‌ భాగస్వామ్యం కూడా ఉందంటున్నారు గుజరాత్ ఎన్నికల ప్రచారం గమనించినవాళ్ళు. మొదటిదశ పోలింగ్‌ మరో రోజు ఉందనగా, నరెంద్ర మోదీని మణిశంకర్‌ "నీచుడు" అంటూ చేసిన వ్యాఖ్యానం గుజరాత్‌ ఎన్నికల ప్రచారం ఒక మలుపు తిప్పేలా చేసింది. ఇది అనేకమంది విశ్లేషకుల ఉవాచ.

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

 మణి శంకర్ ఇచ్చిన ఈ ఆయుధం - అప్పటి వరకూ పరిస్థితికి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న, సమయలో "నీచుడు" అనగానే, దాన్ని అందిపుచ్చుకున్న అభినవ ధనుంజయుడు నరెంద్ర మోదీ - కాంగ్రెస్‌ అప్పటి వరకూ తనను తిట్టిన తిట్లను ఏకరువు పెట్టారు, చెలరేగిపోయారు.


తనను అంతమొందించేందుకు మణిశంకర్ అయ్యర్‌ పాకిస్థాన్‌ వెళ్లి అక్కడ "సుపారీ" ఇచ్చారని అరోపించారు. ఆతర్వాత అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే పాకిస్థాన్‌ కోరికకు ఆధారమిచారన్నారు. సరిహద్దు రాష్ట్రం గుజరాత్‌ లో అసంఖ్యాక హిందువులు పాకిస్థాన్‌ పేరునే సహించరు. అలాంటిది కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌ నేతలతో చేతులు కలిపారని తెలిస్తే గుజరాతీయులు కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా వేయరని చాలా మంది అనుకున్నారు. దాంతో, మొదటి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందురోజు చేసిన ఈ వ్యాఖ్య అక్కడి ఎన్నికలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు.

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

కాంగ్రెస్‌ వ్యతిరేకులు, బీజేపీ అనుకూలురు మాత్రమే కాదు, ఈ వ్యాఖ్యలను సామాన్య ఓటర్లు పెద్దగా ఈ వ్యాఖ్యలను పట్టించుకోలేదనిపించినా ఓటింగ్ సరళిని బట్టి తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తుంది. తమ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జాతీయ నాయకుడిని ప్రధానిని అడ్డు తొలగించాలని కాంగ్రెస్‌ నేతలు కుట్ర పన్నారన్న ప్రచారాన్ని విశ్వసించారు. ఆరోపణల నుంచి కాంగ్రెస్‌ కోలుకుని జవాబు ఇచ్చేసరికి ఈ ఆయుధాన్ని మోడీ సరిగ్గానే వడేశారు దీంతో రెండో దశ పోలింగ్‌ కూడా జరిగేటందుకు సిద్ధమౌతుండగా తాను గుజరాతీనని, అందులోనూ వెనుకబడ్డ కులం వాడినని, అందుకే కాంగ్రెస్‌ తనను "నీచుడు" అన్నదని అలాగే తనను చంపేందుకు సుపారీ ఇచ్చిందనే నరెంద్ర మోడీ ఆరోపణలు గుజరాత్‌ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి బీజేపీ విజయాన్ని అతికస్టంగా నైనా అందించింది.

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

అందుకే కాంగ్రెస్ లోని మణిశంకర్‌ పాత్ర బిజెపిలోని మోడీ పాత్రను మించి బాజపా విజయానికి గణనీయంగానే పనిచేసిందంటున్నారు విఙ్జులు. గతంలో కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయంలోనూ మణిశంకర్‌ పాత్ర సుస్పష్టమే. అప్పట్లో మోదీని మణిశంకర్ "చాయ్‌ వాలా" అని అనటం దాన్నే "చాయ్‌ వాలా" ఒక బ్రాండ్‌గా మార్చేసుకున్నారు. ఇంతగా బాజపా విజయానికిమోదీ-షా లు కూడా శ్రమించి ఉండరు.

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

అయోధ్య రామ మందిరం కేసులో సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపిం చిన కాంగ్రెస్‌ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్‌ సిబాల్‌, 2019 సాధారణ ఎన్నికలు ముగిసే వరకూ కేసును వాయిదా వేయాలని ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి విన్నవించారు. దీన్ని కూడా అద్భుతంగా మోడీ వాడేశారు ఎన్నికల వరకూ ఈ కేసును వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న లాజిక్‌ ఏంటని కపిల్ సిబాల్‌ ను ప్రశ్నించారు. ముస్లిం కమ్యూనిటీ తరఫున కపిల్ సిబాల్‌ పోరాడటంపై ఎలాంటి అభ్యతరం లేదని చెప్పారు. కానీ, వచ్చే ఎన్నికలు ముగిసే వరకూ అయోధ్య కేసును ఎటూ తేల్చొద్దని ఎలా చెప్తారని అన్నారు.

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను రామ మందిరం కేసుతో ముడి పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశం ఎలా పోయినా కాంగ్రెస్‌కు ఫర్వాలేదని ఎన్నికల్లో గెలవటమే దానికి ముఖ్యమని దుయ్యబట్టారు. కాగా, అయోధ్య భూవివాదం కేసు తుది విచారణను ఫిబ్రవరి 8, 2018 కి సుప్రీంకోర్టు వాయిదావేయడం తెలిసిందే.  గుజరాత్ లో కాంగ్రెస్ ఫైల్యూర్ కు కారణం మణిశంకర్ అయ్యర్ మరియు కపిల్ సిబల్ లు కూడా!  

Image result for manisankar iyyar & kapil sibal also reason for congress failure in gujarat

మరింత సమాచారం తెలుసుకోండి: