ఏపీ సీఎం చంద్రబాబు సంగతి దేశమంతా తెలుసు.. కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా ముందు వాడేందుకు రెడీగా ఉంటారు. హైటెక్ పద్దతులు అవలంభిస్తుంటారు. చాలా రాష్ట్రాలు ఏపీని మోడల్ గా తీసుకుంటుంటాయి. అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ఏకంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.. అందుకే ఆయన దేశంలోనే సీనియర్..


కానీ కేసీఆర్ సంగతి అలా కాదు.. ఆయన ముఖ్యమంత్రి అయ్యిందే తొలిసారి. అంతకుముందు ప్రతిపక్షనేతగా కూడా పెద్దగా పని చేయలేదు. చేసింది ఉద్యమం.. చేపట్టింది అధికారం ఇదీ కేసీఆర్ తీరు. కానీ విచిత్రంగా అనుభవం అంతగా లేకున్నా కేసీఆర్ చేపట్టిన కొన్ని సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జిల్లాల విభజన.

new districts of telangana కోసం చిత్ర ఫలితం
కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే జిల్లాల విభజనపై కసరత్తు ప్రారంభించారు.  కేవలం పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా మార్చారు. మొదట్లో 25 జిల్లాలు సరిపోతాయని అనుకున్నా.. కేసీఆర్ దాదాపు వచ్చిన అన్ని జిల్లాల డిమాండ్లు నెరవేర్చారు. చిన్న జిల్లాలతో పాలన సులభంగా ఉంటుందని నమ్మారు. అందుకు తగ్గ ఫలితాలే అంది వస్తున్నాయి.

new districts of telangana కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఫార్ములాను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 13 జిల్లా ఆంధ్రప్రదేశ్ ను కనీసం పాతిక జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అంతర్గతంగా కసరత్తు ప్రారంభమైందని తెలుస్తోంది. మొదట్లో తెలంగాణ జిల్లాల విభజనపై సెటైర్లు వేసినవారే.. ఆ తర్వాత అందులోని సహేతుకతని అర్థం చేసుకున్నట్టు అనిపిస్తోంది. ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో అప్పుడు కొత్త జిల్లాల డిమాండ్లపై నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: